- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆస్ట్రేలియాకు పెద్ద జట్టును పంపాలి: ఎమ్మెస్కే
దిశ, స్పోర్ట్స్: ఆస్ట్రేలియా పర్యటనకు 26 మందితో కూడిన భారత జట్టును పంపించాలని మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో అజాగ్రత్తగా ఉంటే ఆటగాళ్లు అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉందని, వారి ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకొని ఎక్కువ మందిని పర్యటనకు పంపడం మంచిదని సూచించారు. ఇటీవల ఇంగ్లండ్ పర్యటనకు వెస్టిండీస్, పాకిస్తాన్ క్రికెటర్లు పెద్ద సంఖ్యలో అక్కడకు వెళ్లడాన్ని ప్రసాద్ గుర్తు చేస్తున్నారు. ‘ఆడిలైడ్‌లో 14 రోజులపాటు భారత జట్టు క్వారంటైన్‌లో ఉంటుంది. భారత్ – ఏ జట్టును కూడా పంపితే కుర్రాళ్లను పరిశీలించే అవకాశం ఉంటుంది. సీనియర్లకూ జట్టు వ్యూహాన్ని రూపొందించే అవకాశం కలుగుతుంది. క్వారంటైన్ సమయంలో 26 సభ్యుల బృందాన్ని రెండుగా విభజించి ప్రాక్టీస్ మ్యాచ్‌లు నిర్వహించవచ్చు. వారిని విడివిడిగా క్వారంటైన్‌లో ఉంచడం వల్ల కరోనా రిస్క్‌ను తగ్గించవచ్చు’ అని ఎమ్మెస్కే ప్రసాద్ అభిప్రాయపడ్డాడు. ఇండియా – ఏ జట్టులోని యువ బౌలర్లను నెట్స్‌లో ఉపయోగించుకొనే అవకాశం ఉంటుందని, బ్యాట్స్‌మెన్‌కు మంచి ప్రాక్టీస్ ఏర్పడుతుందన్నాడు.