ఆగస్టు నుంచి SPUTNIK-V ప్రొడక్షన్..

by Shamantha N |
Russia, Sputnik V
X

న్యూఢిల్లీ : భారత్‌లో స్పుత్నిక్-వీ కొవిడ్ వ్యాక్సిన్‌ ఉత్పత్తి ఆగస్టులో ప్రారంభం కానుంది. ఈ మేరకు ఈ విషయాన్ని రష్యాకు భారత రాయబారి బాల వెంకటేశ్ వర్మ శనివారం తెలిపారు. ఇప్పటికే మొదటి విడతలో భాగంగా మే1న 1.5 లక్షల వ్యాక్సిన్ డోసులు భారత్‌కు చేరినట్టు తెలిపారు. రెండో విడతలో భాగంగా కొద్ది రోజుల క్రితమే 60వేల డోసులు భారత్‌కు చేరాయని వెల్లడించారు. ‘ఈ నెల చివరి నాటికి 30 లక్షల స్పుత్నిక్-వీ డోసులు భారత్‌కు రానున్నాయి.

జూన్ నాటికి మరో 50 లక్షల డోసులను భారత్‌కు దిగుమతి కానున్నాయి. ఈ వ్యాక్సిన్‌ను మూడు దశల్లో భారత్‌కు రష్యా పంపించనుంది. ఫస్ట్ ఫేజ్‌లో భాగంగా ఇప్పటికే తయారైన వ్యాక్సిన్‌లను రష్యా అందించనుంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం అయింది. సెకండ్ ఫేజ్‌లో నేరుగా వ్యాక్సిన్‌లను వినియోగించుకునేందుకు గాను ఆర్ డీఐఎఫ్ రూపంలో డోసులను పంపించనున్నారు. అయితే వీటిని బాటిల్స్‌లో భారత్ నింపుకోవాల్సి ఉంటుంది. ఇక మూడో ఫేజ్‌లో డైరెక్టుగా వ్యాక్సిన్ టెక్నాలజీని భారత్‌కు అందించనుంది. అనంతరం వ్యాక్సిన్ ఉత్పత్తిని భారత కంపెనీ ఇక్కడే ప్రారంభింస్తుంది’ అని ఆయన చెప్పారు.

Advertisement

Next Story