ప్రముఖ మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కీలక ప్రకటన

by GSrikanth |
ప్రముఖ మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ క్రికెటర్, 2011 వరల్డ్ కప్ హీరో యువరాజ్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తనదైన ఆట తీరుతో జట్టుకు ఎన్నో విజయాలు అందించారు. ముఖ్యంగా 2007లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ బౌలర్ బ్రాడ్ బౌలింగ్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కొట్టి ప్రపంచంలోని అందరి దృష్టిని ఆకర్షించారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం యువరాజ్ సింగ్ కీలక ప్రకటన చేశారు. తాను నటుడిగా మారుతున్నట్లు సోమవారం అధికారికంగా ప్రకటించారు. ‘నా సొంత బయోపిక్‌లో నటించాలని నిర్ణయించుకున్నాను. దర్శకుడు, నిర్మాత, స్క్రిప్ట్ రైటర్‌గా మారబోతున్నా. నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. రాబోయే కొన్నేళ్లలో బిగ్ స్క్రీన్‌పై తుది ఫలితాన్ని చూస్తారు. త్వరలో మరిన్ని అప్‌డేట్స్ ఇస్తా’ అని యువీ ట్విట్టర్‌(ఎక్స్)లో పేర్కొన్నారు. అయితే, ఏప్రిల్ 1st న యువీ ఈ ట్వీట్ చేయడంతో అంతా ఫుల్స్ డే రోజున ఫుల్స్ చేస్తున్నాడని కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed