హైదరాబాద్‌ యూత్‌కు గుడ్ న్యూస్.. రేపే WWE సూపర్ ఫైట్

by GSrikanth |   ( Updated:2023-09-07 07:18:45.0  )
హైదరాబాద్‌ యూత్‌కు గుడ్ న్యూస్.. రేపే WWE సూపర్ ఫైట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ రెజ్లింగ్ పోటీలు చూస్తుంటారు. అందులోనూ ఇంటర్నేషనల్ రెజ్లింగ్‌లో ఫేమస్ అయిన WWE ఫైటింగ్ అంటే అందరికీ ఆసక్తి ఎక్కువగానే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తొలిసారిగా ‘డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ స్పెక్టాకిల్’ పేరుతో ఈవెంట్ నిర్వహించనున్నారు. అయితే.. రేపు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికగా సూపర్ ఫైట్ జరుగనుంది. ఈ సూపర్‌ ఫైట్‌లో 28 మంది అంతర్జాతీయ ఛాంపియన్స్ తలపడనున్నారు.

ప్రపంచ హెవీవెయిట్ ఛాంపియన్ సేథ్ ఫ్రీకిన్ రోలిన్స్, ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్ రియా రిప్లే, వివాదరహిత WWE ట్యాగ్ టీమ్ ఛాంపియన్‌లు సమీ జైన్ & కెవిన్ ఓవెన్స్, ఇంటర్‌కాంటినెంటల్ ఛాంపియన్ “ది రింగ్ జనరల్” గుంథర్, జిండర్ మహల్, వీర్, సంగ, డ్రూ మక్‌ఇంటైర్, బీక్‌టాల్ మక్ఇంటైర్, లుడ్విగ్ కైజర్ & ఇతరులు హజరయ్యే అవకాశం ఉంది. ఈ సూపర్‌ ఫైట్‌ ఈవెంట్‌కు హాట్ కేకుల్లా టికెట్లు అమ్ముడుపోయాయి.

Advertisement

Next Story