WTC Final 2023: అతడు సెంచరీ చేస్తే చాలు.. టీమ్ ఇండియాదే గెలుపు!

by Vinod kumar |
WTC Final 2023: అతడు సెంచరీ చేస్తే చాలు.. టీమ్ ఇండియాదే గెలుపు!
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య WTC Final 2023 మ్యాచ్‌ లండన్‌లోని ఓవల్ వేదికగా భారత కాలమానం ప్రకారం రేపు (జూన్‌ 7) మధ్యాహ్నం 3 గం‍టల నుండి ప్రారంభంకానుంది. ఇరు జట్ల కెప్టెన్లు గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో డబ్ల్యూటీసీ పైనల్లో భారత్ ఫేవరేట్ అని కొందరు మాజీలు చెబుతున్నారు. కానీ ఓవల్ టెస్టులో రహానే లేదా రోహిత్ సెంచరీ చేస్తే భారత్‌దే విజయం అని చరిత్ర చెబుతోంది.

ఇదిలా ఉంటే.. ప్రతిష్టాత్మకమైన ఈ మ్యాచ్‌కు ముందు ఓ ఆసక్తికర విషయం నెట్టింట వైరలవుతుంది. టీమిండియా బ్యాటర్‌ అజింక్య రహానే టెస్ట్‌ల్లో సెంచరీ చేసిన ప్రతిసారి టీమిండియా ఓడిపోలేదు. రహానే తన కెరీర్‌లో 82 టెస్ట్‌‌లు ఆడగా.. 12 సెంచరీలు చేయగా.. వాటిలో టీమిండియా 9 మ్యాచ్‌ల్లో గెలుపొంది, 3 మ్యాచ్‌లను డ్రా చేసుకుంది. మూడు మ్యాచ్‌లను డ్రాగా ముగించింది. రంజీ ట్రోఫీలో సత్తా చాటిన రహానే.. అదే ఫామ్‌ను ఓవల్‌లోనూ కొనసాగించి శతకం బాదితే.. డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్ గెలిచే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.

Advertisement

Next Story

Most Viewed