WTC Final 2023: ఆరో వికెట్ కోల్పోయిన ఆసీస్..

by Vinod kumar |   ( Updated:2023-06-08 11:08:53.0  )
WTC Final 2023: ఆరో వికెట్ కోల్పోయిన ఆసీస్..
X

దిశ, వెబ్‌డెస్క్: WTC Final 2023లో ఆస్ట్రేలియా ఆరో వికెట్‌ కోల్పోయింది. 121 పరుగులు చేసిన స్మిత్‌ శార్దూల్‌ ఠాకూర్‌ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. టీమిండియాకు సిరాజ్‌ బ్రేక్‌ అందించాడు. 285 పరుగుల భాగస్వామ్యంతో టీమిండియాకు ఇబ్బందికరంగా మారిన స్మిత్‌, ట్రెవిస్‌ హెడ్‌ జంటను సిరాజ్‌ విడదీశాడు. రెండోరోజు ఆట మొదలైన కాసేపటికి సిరాజ్‌ బౌలింగ్‌లో హెడ్‌ క్యాచ్‌ ఔట్‌గా వెనుదిరిగాడు. దీంతో 163 పరుగుల హెడ్‌ ఇన్నింగ్స్‌కు తెరపడినట్లయింది.

రెండో రోజు ఆటలో ఆస్ట్రేలియా వరుసగా వికెట్లు కోల్పోతుంది. తాజాగా ఆరు పరుగులు చేసిన కామెరాన్‌ గ్రీన్‌ షమీ బౌలింగ్‌లో గిల్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 6 వికెట్ల నష్టానికి 387 పరుగులు చేసింది. ప్రస్తుతం అలెక్స్ (12), స్టార్క్ (3) పరుగులతో క్రీజులో ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed