Vinesh Phogat:వినేశ్ ఫొగాట్ రిటైర్మెంట్ ప్రకటన పై స్పందించిన రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు

by Jakkula Mamatha |
Vinesh Phogat:వినేశ్ ఫొగాట్ రిటైర్మెంట్ ప్రకటన పై స్పందించిన రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు
X

దిశ,వెబ్‌డెస్క్: ఒలంపిక్స్ లో స్వర్ణం వరకు చేరుకొని అనర్హతకు గురైన వినేశ్ ఫొగాట్ సంచలన నిర్ణయం తీసుకుంది. రెజ్లింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ ట్వీట్టర్ లో పోస్ట్ పెట్టింది. ఈ క్రమంలో వినేశ్ ఫొగాట్ రిటైర్మెంట్ ప్రకటన పై రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు సంజయ్ సింగ్ స్పందించారు. ఫొగాట్ తీసుకున్న నిర్ణయం సోషల్ మీడియా ద్వారా తెలిసిందన్నారు. ఆమె తనంతట తానుగా రిటైర్ కావాలని నిర్ణయించుకోవడం తమను షాక్‌కు గురి చేసిందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి నిర్ణయం వద్దని తాను విజ్ఞప్తి చేస్తున్నాను..ఈ పరిస్థితి నుంచి బయటకు వచ్చాక సరైన నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఒలింపిక్స్‌లో ఫొగాట్ అధిక బరువు ఉండటంపై సంజయ్ సింగ్ ఆమె సహాయక సిబ్బంది పై మండిపడ్డారు. ఇందులో వినేశ్ ఫొగాట్ పొరపాటు ఏమీ లేదన్నారు. ఆమెకు ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఫిజియో, పోషకాహార నిపుణుడితో సహా కోచ్, ఇతర సహాయక సిబ్బంది చూసుకోవాల్సిందన్నారు. ఈ అంశంపై విచారణ జరపాలని సంజయ్ సింగ్ డిమాండ్ చేశారు.

Advertisement

Next Story