- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మహిళల జట్టు జోరు.. పురుషుల జట్టుకు రెండో ఓటమి
దిశ, స్పోర్ట్స్ : సౌత్ కొరియాలో జరుగుతున్న వరల్డ్ టేబుల్ టెన్నిస్ టీమ్ చాంపియన్‌షిప్ టోర్నీలో భారత మహిళల జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. తొలి మ్యాచ్‌లో చైనాతో చేతిలో ఓడి వెనుకబడిన జట్టు హంగేరీని ఓడించి పుంజుకుంది. తాజాగా ఉజ్బెకిస్తాన్‌ను మట్టికరిపించింది. సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 3-0 తేడాతో ఉజ్బెకిస్తాన్‌పై ఏకపక్ష విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో అర్చన 3-0 తేడాతో రిమ్మా గుఫ్రనోవాను చిత్తు చేయగా.. రెండో మ్యాచ్‌లో మనిక బాత్రా 3-0 తేడాతోనే మార్ఖబో మగ్దీవాను ఓడించింది. దీంతో భారత్ 2-0తో ఆధిక్యంలోకి వెళ్లగా.. మూడో మ్యాచ్‌లో దివ్య పరాగ్ జట్టు విజయాన్ని ఖాయం చేసింది. రోజలీనాపై 3-1 తేడాతో దివ్య గెలుపొందడంతో మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే భారత్ మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. చివరి గ్రూపు మ్యాచ్‌లో మహిళ జట్టు స్పెయిన్‌తో తలపడనుంది. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్‌లో రెండో స్థానంలో ఉన్న భారత్‌కు తర్వాతి రౌండ్ బెర్త్ దక్కినట్టే.
పురుషుల జట్టు ఆశలు సంక్లిష్టం
మరోవైపు, పురుషుల జట్టు వరుసగా రెండో ఓటమిని చవిచూసింది. సౌత్ కొరియా చేతిలో 3-0 తేడాతో పరాజయంపాలైంది. హర్మీత్ దేశాయ్, సత్యన్ జ్ఞానేశ్వరన్, శరత్ కమల్ వరుస మ్యాచ్‌ల్లో ఓడిపోయి మ్యాచ్‌ను ప్రత్యర్థికి సమర్పించారు. గత మ్యాచ్‌లో అమెరికా చేతిలో 3-2 తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. వరుసగా రెండు ఓటములతో పురుషుల జట్టు తర్వాతి రౌండ్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్‌లో పురుషుల జట్టు 4వ స్థానంలో ఉన్నది. ఆఖరి గ్రూపు మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో భారత్ తలపడనుండగా.. ఈ మ్యాచ్‌లో గెలిస్తే తర్వాతి రౌండ్ ఆశలు సజీవంగా ఉంటాయి. అప్పటికీ మిగతా జట్ల ఫలితాలపైనే బెర్త్ ఆధారపడి ఉంటుంది.