వరల్డ్ జూనియర్ చెస్ చాంపియన్‌షిప్‌లో అగ్రస్థానానికి దివ్య

by Harish |
వరల్డ్ జూనియర్ చెస్ చాంపియన్‌షిప్‌లో అగ్రస్థానానికి దివ్య
X

దిశ, స్పోర్ట్స్ : భారత చెస్ క్రీడాకారిణి దివ్య దేశ్‌ముఖ్ వరల్డ్ జూనియర్ చెస్ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ దిశగా సాగుతోంది. గుజరాత్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో ఎనిమిది రౌండ్లు ముగిసేసరికి దివ్య 8 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. మంగళవారం జరిగిన 8వ రౌండ్‌లో దివ్య సహచర క్రీడాకారిణి రక్షిత రవిపై నెగ్గింది. దివ్యకు ఇది వరుసగా రెండో విజయం. మరో భారత క్రీడాకారిణి సచి జైన్ మూడో సీడ్ బెలోస్లోవా క్రాస్టేవా(బల్గేరియా)కు షాకిచ్చింది. తెల్లపావులతో ఆడిన ఆమె 57 ఎత్తుల్లో గేమ్‌ను దక్కించుకుంది. 7 పాయింట్లతో సచి జైన్ మూడో స్థానంలో ఉన్నది. ఓపెన్ కేటగిరీలో 8వ రౌండ్‌లో ప్రణవ్ ఆనంద్ డ్రా చేసుకోగా.. శ్రీహరి- ఎథాన్ వాజ్ మధ్య, అనుజ్-సమత్ మధ్య జరిగిన గేమ్‌లు డ్రా అయ్యాయి. టోర్నీలో మరో మూడు రౌండ్లు మిగిలి ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed