- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహిళల T20 ప్రపంచకప్: ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ షార్ట్‌లిస్ట్‌లో యవ ప్లేయర్
దిశ, వెబ్‌డెస్క్: మహిళల T20 ప్రపంచకప్ కోసం ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా 9 మంది ప్లేయర్ల పేర్లను ఐసీసీ షార్ట్‌లిస్ట్ చేసింది. ఈ లిస్ట్ లో భారత్ నుంచి హర్మన్‌ప్రీత్, మంధాన కాకుండా.. 19 ఏళ్ల రిచా ఘోష్ పేరు ఉంది. కాగా ఈ ప్రపంచ కప్ మ్యాచ్ లో ఘోష్ 68 సగటుతో 136 పరుగులు చేసింది.
అలాగే అనేక మ్యాచుల్లో బెస్ట్ ఫినిషర్ గా కీలక పాత్ర పోషించింది. అలాగే ఈ టోర్నమెంట్‌లో కేవలం రెండు సార్లు మాత్రమే అవుట్ అయింది. అలాగే ఆమే బ్యాటింగ్ చేసిన ప్రతి మ్యాచ్‌లో 130 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో స్కోర్ చేసింది. ఈ క్రమంలోనే ఐసీసీ రిచా ఘోష్‌ను పేరును షార్ట్‌లిస్ట్ చేసింది.
ఈ అవార్డుకు ఎంపికైన మిగతా ఎనిమిది మంది ఆటగాళ్లలో ఆస్ట్రేలియా నుంచి ముగ్గురు, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా నుంచి ఇద్దరు, వెస్టిండీస్ నుంచి ఒకరు ఉన్నారు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు మెగ్ లానింగ్, అలిస్సా హీలీ మరియు యాష్ గార్డనర్ కాగా, నాట్ స్కివర్-బ్రంట్, సోఫీ ఎక్లెస్టోన్ ఇద్దరు ఇంగ్లీష్ ప్లేయర్‌లు షార్ట్‌లిస్ట్‌లో ఉన్నారు. ఈ అవార్డుకు నామినేట్ చేయబడిన ఇద్దరు ప్రోటీస్ ఆటగాళ్లు లారా వోల్వార్డ్, తజ్మిన్ బ్రిట్స్ కాగా, వెస్టిండీస్ కెప్టెన్ హేలీ మాథ్యూస్ జాబితాను పూర్తి చేశారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఇప్పుడు ఓటు వేసి అవార్డు విజేతను నిర్ణయించే అవకాశం ఉంది. మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్ ఆదివారం జరగనుంది, దక్షిణాఫ్రికా డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఆదివారం జరిగే ఫైనల్ తర్వాత ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ వెల్లడి కానుంది.