Women's T20 World Cup: టాస్ గెలిచిన భారత మహిళల జట్టు

by Mahesh |
Womens T20 World Cup: టాస్ గెలిచిన భారత మహిళల జట్టు
X

దిశ, వెబ్‌డెస్క్: దుబాయ్ వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్ నువ్వా నేనా అన్నట్లు సాగుతోంది. ఈ సారి రెండు గ్రూపుల్లో కీలక జట్లు ఉండటంతో పోటీ భారీగా పెరిగిపోయింది. ఈ క్రమంలో నేడు 12వ మ్యాచ్ గ్రూప్-A లోని భారత్, శ్రీలంక జట్ల మధ్య దుబాయ్ వేదికగా జరగుతుంది. కాగా ఈ మ్యాచులో టాస్ గెలిచిన భారత్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. మొదటి మ్యాచులో ఓటమి పాలైన భారత్ మహిళల జట్టు, రెండో మ్యాచ్ లో పాకిస్తాన్ పై భారీ విజయం సాధించింది. దీంతో సెమిస్ రేసులో నిలిచింది. కాగా ఈ మ్యాచులో భారత్ గెలిస్తేనే పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలువనుంది. ఈ క్రమంలో నెట్ మ్యాచులో భారత్ ఎలాగైనా గెలవాలనే తపనతో ఉంది. అలాగే మరోపక్క ఈ సీజన్ లో రెండు మ్యాచులు ఆడిన శ్రీలంక రెండింటిలోను ఓడిపోయింది. దీంతో ఈ మ్యాచులో ఎలాగైనా గెలవాలనే తపనతో ఉంది. మరి ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో తెలియాలంటే చివరి వరకు వేచి చూడాల్సిందే మరి.

భారత ప్లేయింగ్ XI జట్టు: షఫాలీ వర్మ, స్మృతి మంధాన, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (సి), రిచా ఘోష్ (w), దీప్తి శర్మ, సజీవన్ సజన, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్, ఆశా శోభన, రేణుక ఠాకూర్ సింగ్

శ్రీలంక ప్లేయింగ్ XI జట్టు: విష్మి గుణరత్నే, చమరి అతపత్తు(సి), హర్షిత సమరవిక్రమ, కవిషా దిల్హరి, నీలాక్షి డి సిల్వా, అనుష్క సంజీవని(w), అమ కాంచన, సుగండిక కుమారి, ఇనోషి ప్రియదర్శని, ఉదేశిక ప్రబోధని, ఇనోషి

Advertisement

Next Story