భారత మహిళా ప్లేయర్లపై కాసుల వర్షం.. రికార్డు ధర పలికిన ఆటగాళ్లు వీరే

by Vinod kumar |   ( Updated:2023-02-13 12:56:58.0  )
భారత మహిళా ప్లేయర్లపై కాసుల వర్షం.. రికార్డు ధర పలికిన ఆటగాళ్లు వీరే
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ తరహాలో భారత్‌లో తొలిసారిగా పూర్తిస్థాయిలో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ మహిళా ప్రీమియర్ లీగ్ పోటీల కోసం నేడు ముంబయిలో ఆటగాళ్ల వేలం నిర్వహిస్తున్నారు. మిలియనీర్లు గా మారిన భారత మహిళా ప్లేయర్లు.. ఈ లీగ్ తొలి సీజన్ వేలం ముంబై వేదికగా జరుగుతుండగా.. ఐదు జట్లు ఆటగాళ్లపై విపరీతంగా కాసుల వర్షం కురిపించాయి.

టీమిండియా ఓపెనర్ స్మృతి మంధాన కు భారీ ధర లభించింది. వేలంలో స్మృతిని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ రూ.3.4 కోట్ల ధరకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత టీమిండియా ఆల్ రౌండర్ దీప్తి శర్మపై అన్ని జట్లు కన్నేశాయి. చివరకు యూపీ వారియర్స్ రూ. 2.60 కోట్లతో దక్కించుకుంది. భారత జట్టు కెప్టెన్ హర్మన్‌ ప్రీత్ కౌర్‌‌ను ముంబై ఇండియన్స్ రూ.1.80 కోట్ల ధరకు కొనుగోలు చేసింది.

భారత జట్టు ఫాస్ట్ బౌలర్ రేణుకా ఠాకూర్ కూడా కోటీశ్వరురాలిగా మారింది. బెంగళూరు రూ.1.50 కోట్లతో దక్కించుకుంది. టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించిన జెమీమా రోడ్రిగ్జ్.. ఈ వేలంలో కోటీశ్వరురాలిగా మారింది. జెమీమా రోడ్రిగ్జ్‌ను రూ.2.20 కోట్లకు ఢిల్లీ దక్కించుకుంది. తుఫాను బ్యాటింగ్‌కు ప్రసిద్ధి చెందిన షెఫాలీ వర్మను ఢిల్లీ రూ.2 కోట్లు ఖర్చు చేసింది.

ఇప్పటి వరకు జరిగిన డబ్ల్యూపీఎల్ వేలంలో 26 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశారు. మొత్తంగా అన్ని జట్లు కలిపి ఇప్పటి వరకు రూ.39.65 కోట్లు వెచ్చించాయి. ఇందులో అత్యంత ఖరీదైన ప్లేయర్‌గా మంధాన లినిచింది. మంధానను రూ.3.40 కోట్లకు ఆర్‌సీబీ దక్కించుకుంది. మొత్తం 26 మంది ఆటగాళ్లలో 14 మంది విదేశీ ప్లేయర్లు ఉన్నారు.

ఇప్పటి వరకు డబ్ల్యూపీఎల్ వేలంలో బిడ్లు దక్కించుకున్న ఆటగాళ్లు వీరే..

1. స్మృతి మంధాన (IND) - రూ. 3.4 కోట్లు - RCB

2. హర్మన్‌ప్రీత్ కౌర్ (IND) - రూ. 1.8 కోట్లు - MI

3. సోఫీ డివైన్ (NZ) - రూ. 50 లక్షలు - RCB

4. ఆష్లీ గార్డనర్ (AUS) - రూ. 3.2 Cr - GG

5. ఎలిస్ పెర్రీ (Aus) - రూ. 1.7 Cr - RCB

6. సోఫీ ఎక్లెస్టోన్ (Eng) - రూ. 1.8 Cr - UP వారియర్జ్

7. దీప్తి శర్మ (IND) - రూ. 2.6 కోట్లు - UP వారియర్జ్

8. రేణుకా సింగ్ (IND) - రూ. 1.5 కోట్లు - RCB

9. నటాలీ స్కివర్ (ఇంగ్లండ్) - రూ. 3.2 Cr - MI

10. తహ్లియా మెక్‌గ్రాత్ (AUS) - రూ. 1.4 కోట్లు - UP వారియర్జ్

11. బెత్ మూనీ (AUS) - 2 కోట్లు - గుజరాత్ జెయింట్స్

12. షబ్నిమ్ ఇస్మాయిల్ (SA) - రూ. 1 Cr - UP వారియర్జ్

13. అమేలియా కెర్ (NZ) - రూ. 1 Cr - MI

14. సోఫియా డంక్లీ (ఇంగ్లండ్) - రూ. 60 లక్షలు - గుజరాత్ జెయింట్స్

15. జెమిమా రోడ్రిగ్స్ (IND) - రూ. 2.2 Cr - DC

16. మెగ్ లానింగ్ (Aus) - రూ. 1.1 Cr - DC

17. షఫాలీ వర్మ (భారతదేశం) - రూ. 2 Cr - DC

18. అన్నాబెల్ సదర్లాండ్ (AUS) - రూ. 70 లక్షలు - గుజరాత్ జెయింట్స్

19. హర్లీన్ డియోల్ (IND) - రూ. 40 లక్షలు - గుజరాత్ జెయింట్స్

20. పూజా వస్త్రాకర్ (IND) - రూ. 1.9 Cr - MI

21. డియాండ్రా డాటిన్ (WI) - రూ. 50 లక్షలు - గుజరాత్ జెయింట్స్

22. యస్తికా భాటియా (IND) - రూ. 1.5 కోట్లు - MI

23. రిచా ఘోష్ (IND) - రూ. 1.9 కోట్లు - RCB

24. అలిస్సా హీలీ (AUS) - రూ. 70 లక్షలు - యూపీ వారియర్జ్

25. అంజలి సర్వాణి (IND) - రూ. 55 లక్షలు - యూపీ వారియర్జ్

26. రాజేశ్వరి గయాక్వాడ్ (IND) - రూ. 40 లక్షలు - యూపీ వారియర్జ్

Advertisement

Next Story

Most Viewed