- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సెమీస్‌కు భారత్.. ఉత్కంఠ పోరులో జపాన్‌పై గెలుపు
రాంచీ : మహిళల ఏషియన్ హాకీ చాంపియన్స్ ట్రోఫీలో భారత మహిళల జట్టు సెమీస్‌కు దూసుకెళ్లింది. జార్ఖండ్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో తొలి రౌండ్‌లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 2-1 తేడాతో జపాన్‌ను చిత్తు చేసింది.ఇరు జట్ల ప్లేయర్లు చక్కటి డిఫెన్స్ ప్రదర్శించడంతో ఫస్టాఫ్‌లో ఏ జట్టుకు గోల్ దక్కలేదు. ఇక, సెకండాఫ్ ఆరంభంలోనే నవ్‌నీత్ కౌర్ 31వ నిమిషంలో ఫీల్డ్ గోల్‌తో భారత్ ఖాతా తెరిచింది. అయితే, కాసేపటికే జపాన్ క్రీడాకారిణి ఉరత కన 37వ నిమిషంలో గోల్ చేసి స్కోరును 1-1తో సమం చేయడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది.
అయితే, 47వ నిమిషంలో సంగీత కుమారి పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచడంతో 2-1తో మ్యాచ్‌పై భారత్ పట్టు సాధించింది. అలాగే, నిర్ణీత సమయం వరకు ప్రత్యర్థిని గోల్ చేయకుండా నిలువరించింది. జపాన్‌పై గెలుపుతో భారత్ మరో మ్యాచ్ మిగిలి సెమీస్‌కు అర్హత సాధించింది. తొలి రౌండ్‌లో గురువారం సౌత్ కొరియాతో భారత జట్టు చివరి మ్యాచ్ ఆడనుంది. మరోవైపు, జపాన్ సైతం సెమీస్‌కు క్వాలిఫై అయ్యింది.