తడబడతారా.. తేల్చేస్తారా!.. విజయానికి చేరువలో టీమిండియా

by Shiva |
తడబడతారా.. తేల్చేస్తారా!.. విజయానికి చేరువలో టీమిండియా
X

దిశ, వెబ్‌డెస్క్: రాంచీ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో భారత్ పట్టు బిగించింది. రెండో ఇన్సింగ్స్‌లో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్లను భారత స్పిన్నర్ల ధాటికి విలవిలలాడారు. ఈ క్రమంలో ఇంగ్లండ్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 145 పరుగులకే ఆలౌటైంది. స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ 5 వికెట్లు నేల కూల్చగా.. కుల్దీప్‌ యాదవ్‌ 4 వికెట్లు తీశాడు. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఓ వికెట్‌ తీసుకున్నాడు. కాగా, తొలి ఇన్నింగ్స్‌లో లభించిన లీడ్‌‌తో కలిపి ఇంగ్లండ్‌ భారత్‌కు 192 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

అయితే, ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌ను చక్కబెట్టేందుకు ప్రయత్నించిన బెన్ ఫోక్స్‌(17)ను అశ్విన్‌కు రిట‌ర్న్ క్యాచ్‌తో ఔట్ చేశాడు. ఆ త‌ర్వాతి బంతికే జేమ్స్ అండ‌ర్స్‌న్(0) కీపర్ చేతికి చిక్కాడు. అంతకు ముందు జాక్‌ క్రాలే (60) రాణించగా.. బెయిర్‌స్టో (30), ఫోక్స్‌ (17), డకెట్‌ (15) గౌరవప్రదమైన స్కోర్ సాధించారు. ఇక రూట్‌ (11), పోప్‌ (0), స్టోక్స్‌ (4), హార్ట్లీ (7), రాబిన్సన్‌ (0) సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ చేపట్టిన భారత్ 8 ఓవర్లలో 40 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ (24), జైశ్వాల్(16) పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇక భారత్ విజయం సాధించాంటే 152 పరుగులు చేస్తే సరిపోతోంది.

Advertisement

Next Story