WI vs IND: ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు పడగొట్టిన యజువేంద్ర చాహల్..

by Vinod kumar |   ( Updated:2023-08-03 15:10:54.0  )
WI vs IND: ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు పడగొట్టిన యజువేంద్ర చాహల్..
X

దిశ, వెబ్‌డెస్క్: ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్ - భారత్ (WI vs IND) జట్ల మధ్య ట్రినిడాడ్‌ వేదికగా జరుగుతన్న తొలి మ్యాచ్‌‌లో టీమ్ ఇండియా స్పిన్నర్ యజువేంద్ర చాహల్ చెలరేగాడు. ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు పడగొట్టాడు. చాహల్ తన తొలి ఓవర్‌లో మొదటి బంతికే వికెట్ పడగొట్టాడు.4.1 ఓవర్‌కు కైల్ మేయర్స్‌ (1) వికెట్ల ముందు దొరికిపోయాడు.

అదే ఓవర్‌లో దూకుడుగా ఆడుతున్న బ్రెండన్‌ కింగ్ (28; 19 బంతుల్లో)ను చాహల్ ఔట్ చేశాడు. అతడు వేసిన 4.3 ఓవర్‌కు కింగ్‌ వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో విండీస్‌ రెండో వికెట్ కోల్పోయింది. 5 ఓవర్లకు స్కోరు 40/2. పూరన్ (10), చార్లెస్‌ (1) క్రీజులో ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed