- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జూనియర్ విరాట్ ‘అకాయ్’ పేరు అర్థమేంటో తెలుసా?
దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు మరోసారి తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. విరాట్ భార్య అనుష్క పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. విరుష్క దంపతులు తమ కుమారుడికి ‘అకాయ్’గా పేరు పెట్టారు. దీంతో ‘అకాయ్’ పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ఆ పేరు అర్థమేంటో తెలుసుకోవడానికి నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు. గూగుల్‌లో తెగ వెతికేస్తున్నారు.
అకాయ్ పేరు అర్థం, ఆ పేరును ఎక్కడి నుంచి తీసుకున్నామనేది విరాట్‌గానీ, అనుష్కగానీ ఇంకా తెలియజేయలేదు. అయితే, కొందరు అకాయ్ అర్థం ఇదేనంటూ కామెంట్స్ చేస్తున్నారు. అకాయ్ అనేది హిందీ పదం ‘కాయ’ నుంచి వచ్చింది. కాయ అంటే శరీరం అని అర్థం. అకాయ్ అంటే శరీరం కంటే ఎక్కువ కలిగిన వ్యక్తి అని అర్థం వస్తుందని పలువురు కామెంట్ చేస్తున్నారు. అలాగే, అకాయ్ అనే పేరు టర్కిష్ మూలానికి చెందినది. దాని ప్రకారం అకాయ్ అంటే ‘ప్రకాశించే చంద్రుడు’ అని అర్థం వస్తుంది. మరోవైపు, అనుష్క, కోహ్లీ పేర్ల మొదటి అక్షరాల నుంచి నుంచి తీసుకుని ఆ పేరు పెట్టినట్టు కొందరు కామెంట్ చేస్తున్నారు.
కోహ్లీ, అనుష్క దంపతులకు అకాయ్ రెండో సంతానం. తొలి సంతానంగా 2021లో వామిక జన్మించిన విషయం తెలిసిందే. వామిక అంటే దుర్గాదేవి అని అర్థం వస్తుంది. పార్వతీ దేవి మరోపేరు వామిక.