- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారత్ పై రాబోయే వరల్డ్ కప్ లో పగ తీర్చుకుంటాం: పాకిస్తాన్ మాజీ లెజెండ్ షోయబ్ అక్తర్
దిశ, వెబ్ డెస్క్: ఈ ఏడాది చివర్లో జరిగే వన్డే వరల్డ్ కప్ కోసం అన్ని దేశాలూ పోటీకి సన్నద్ధమవుతున్నాయి. భారత్ వేదికగా జరిగే టోర్నీ టీమిండియాకు కూడా చాలా కీలకం కానుంది. దీనిపై తాజాగా మాట్లాడిన పాకిస్తాన్ మాజీ లెజెండ్ షోయబ్ అక్తర్.. తానైతే భారత్, పాకిస్తాన్ జట్లు వరల్డ్ కప్ ఫైనల్‌లో ఆడాలని అనుకుంటున్నట్లు తెలిపాడు. ఈ మ్యాచ్ ఎక్కడ జరిగినా సరే తనకు మాత్రం రెండు జట్లు తలపడడం తాను కొరుకున్నట్లు తన అభిప్రాయాన్ని వెల్లిబుచ్చాడు.
2011లో స్వదేశంలో జరిగిన వరల్డ్ కప్‌ను భారత్ నెగ్గిన సంగతి తెలిసిందే. ఆ టోర్నీ ఫైనల్‌లో శ్రీలంకపై గెలిచిన భారత్.. ఫైనల్ చేరేందుకు సెమీఫైనల్‌లో పాకిస్తాన్‌ను ఓడించింది. ఇదే విషయాన్ని అక్తర్ గుర్తుచేశాడు. 'నాకు భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే ఫైనల్ కావాలి. అది ముంబైలో జరిగినా, అహ్మదాబాద్‌లో జరిగినా ఎక్కడైనా పర్లేదు. 2011 ఓటమికి పగ తీర్చుకోవాలి' అంటూ అక్తర్ అన్నాడు. అదేవిధంగా ప్రస్తుతం బీసీసీఐ, పీసీబీ మధ్య గొడవకు కారణమైన ఆసియా కప్ 2023 గురించి కూడా మాట్లాడాడు. టోర్నీ మొత్తం పాక్‌లోనే జరగాలని పీసీబీ పట్టుబడుతుండగా భారత జట్టును పాకిస్తాన్ పంపడం కుదరదని బీసీసీఐ తెలిపింది.