బలంగా తిరిగి వస్తాం: హర్మన్‌ప్రీత్ కౌర్

by Mahesh |
బలంగా తిరిగి వస్తాం: హర్మన్‌ప్రీత్ కౌర్
X

న్యూఢిల్లీ : మహిళల టీ20 వరల్డ్ కప్‌‌లో భారత్ సెమీస్‌లోనే ఇంటిదారిపట్టిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా‌తో ఉత్కంఠసాగిన మ్యాచ్‌లో 5 పరుగుల తేడాతో భారత్ ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో శనివారం అభిమానులను ఉద్దేశించి కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ట్వీట్ చేసింది. ప్రపంచకప్‌లో మద్దతుగా నిలిచిన అభిమానులందరికీ ధన్యవాదాలు తెలిపింది. ‘ఇంత దూరం వస్తామని నమ్మకం ఉంచినందుకు కృతజ్ఞతలు. అభిమాన జట్టు ఓడినందుకు అభిమానిగా బాధ ఉంటుందని నాకు తెలుసు. తప్పకుండా బలంగా పుంజుకుని తిరిగి వస్తాం.

గొప్ప ప్రదర్శనతో అలరిస్తాం’ అని హర్మన్‌‌ప్రీత్ పోస్టు చేసింది. కాగా, చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఒక దశలో టీమ్ ఇండియనే విజయం సాధించేలా కనిపించింది. జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ జోడీ అవుటైన తర్వాత భారత్‌కు విజయావకాశాలు గల్లంతయ్యాయి. ముఖ్యంగా రెండో పరుగు తీసే క్రమంలో హర్మన్‌ప్రీత్ విచిత్రంగా రనౌట్ కావడం భారత్‌ను దెబ్బతీసింది. దీప్తి శర్మ చివరి బంతి వరకు నిలిచినా అప్పటికే టీమ్ ఇండియా ఓటమి ఖరారైంది.

Advertisement

Next Story