- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆసిస్ దూకుడుకు బ్రేక్ వేస్తాం: దీప్తి శర్మ
ఆసిస్ దూకుడుకు బ్రేక్ వేస్తాం: దీప్తి శర్మ
దిశ, స్పోర్ట్స్ : మూడో వన్డేలో ఆస్ట్రేలియా దూకుడుకు బ్రేక్ వేస్తామని టీమ్ ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ దీమా వ్యక్తం చేసింది. నేడు ఆస్ట్రేలియాతో జరగబోయే మూడో వన్డేకు ముందు సోమవారం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో దీప్తి శర్మ మాట్లాడుతూ.. ‘విజయం, ఓటమి ఆటలో భాగం. కానీ, మేము జట్టుగా మెరుగుపడ్డాం. అది బ్యాటింగ్‌లోనైనా, బౌలింగ్‌లోనైనా. ఆస్ట్రేలియా విజయపరంపరకు బ్రేక్ వేస్తాం. ఇంతకుముందు ఆస్ట్రేలియాపై విజయానికి దగ్గరగా వెళ్లిన సందర్భాలు తక్కువే. కానీ, గత మ్యాచ్‌లో మేము అది చేయడం సానుకూలంశం. ఇకపై, అదే తరహా ప్రదర్శనను కొనసాగిస్తాం. ఏ జట్టైనా గెలవాలనే ఆడుతుంది. కొన్నిసార్లు మీరు గెలుస్తారు. మరికొన్ని మ్యాచ్‌ల్లో గెలవకపోవచ్చు.’అని చెప్పుకొచ్చింది. కాగా, గత మ్యాచ్‌లో దీప్తి శర్మ 5 వికెట్ల ప్రదర్శనతో మెరిసింది. బ్యాటుతో 36 బంతుల్లో 24 పరుగులతో అజేయంగా నిలిచిన ఆమె.. జట్టును గెలిపించేందుకు చివరి వరకూ పోరాడింది.