- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
భారత డ్రెస్సింగ్ రూంలో సందడి చేసిన ధావన్.. బెస్ట్ ఫీల్డర్ మెడల్ అతనిదే

దిశ, స్పోర్ట్స్ : భారత ఆటగాళ్లలో జోష్ నింపేందుకు టీమ్ మేనేజ్‌మెంట్ వన్డే వరల్డ్ కప్-2023 నుంచి ప్రతి మ్యాచ్‌లో అత్యుత్తమంగా ఫీల్డింగ్ చేసిన ప్లేయర్‌కు బెస్ట్ ఫీల్డర్ అవార్డు ఇస్తున్నది. చాంపియన్స్ ట్రోఫీలోనూ ఆ ఆనవాయితీని కొనసాగిస్తున్నది. పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు సంబంధించి బెస్ట్ ఫీల్డర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అక్షర్ పటేల్‌ను వరించింది. అక్షర్‌తోపాటు జడేజా, శ్రేయస్ అయ్యర్ కూడా అవార్డు కోసం పోటీ పడ్డారు. కానీ, అక్షర్ అవార్డు గెలిచినట్టు ఫీల్డింగ్ కోచ్ దిలీప్ ప్రకటించాడు. అక్షర్‌కు బెస్ట్ ఫీల్డర్ అవార్డును భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ అందజేశాడు. డ్రెస్సింగ్ రూం వీడియోను బీసీసీఐ ట్విట్టర్‌లో పోస్టు చేసింది. పాక్‌తో మ్యాచ్‌లో అక్షర్ అద్భుతంగా ఫీల్డింగ్ చేశాడు. ఒక్క వికెట్ తీయడంతోపాటు ఒక క్యాచ్, రెండు రనౌట్‌లు చేశాడు. ఇమామ్ ఉల్ హక్‌ను డైరెక్ట్ త్రోతో రనౌట్ చేయడం మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది.