- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎంత చెప్పినా వినలేదు.. ఆమెతో ఆ రోజు రాత్రి : నటితో డేటింగ్ గురించి ఓపెన్ అయిన యువరాజ్
దిశ, స్పోర్ట్స్ : గతంలో తాను ఓ హీరోయిన్‌తో డేటింగ్ చేశానని భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తెలిపాడు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న యువీ.. 2007-08లో ఆస్ట్రేలియా పర్యటన గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఈ పర్యటన సమయంలో తాను ఓ నటితో డేటింగ్‌లో ఉన్నానని, తాను చెప్పినా వినకుండా ఆమె మ్యాచ్‌లకు హాజరైందని చెప్పాడు. అయితే, యువీ ఆ నటి పేరు వెల్లడించలేదు. ‘ఆమె ఇప్పటికీ చాలా పాపులర్. అప్పుడు ఆమె అడిలైడ్‌కు షూటింగ్ కోసం వచ్చింది. నన్ను కలవడానికి రావొద్దని, నేను ఆటపై దృష్టి పెట్టాలని చెప్పినా ఆమె పట్టించుకోలేదు. మా వెనకే బస్సులో కాన్‌బెర్రాకు వచ్చింది. రెండు టెస్టుల్లో నేను పరుగులు చేయలేదు. ‘ఇక్కడ ఏం చేస్తున్నావు’ అని ఆమెను అడిగా. ‘నీతో సమయం గడపాలనుకుంటున్నా’ అని చెప్పింది. ఆ రోజు రాత్రి ఆమెను కలిశా. చాలా సేపు మాట్లాడుకున్నాం. అప్పుడు ఆమెకు ఒక్కటే మాట చెప్పా. ‘నీ కెరీర్‌పై ఫోకస్ పెట్టు. నేను కూడా నా పనిపై దృష్టి పెడతా. ఎందుకంటే, ఆస్ట్రేలియా పర్యటన ఎంత కఠినమో తెలుసు కదా’ అని చెప్పా. కాన్‌బెర్రా నుంచి మేము అడిలైడ్‌కు వెళ్లేందుకు సిద్ధమయ్యాం. ఆమెనే నా సూట్‌కేస్ ప్యాక్ చేసింది. ఉదయం నా షూ కనిపించలేదు. నా షూ ఎక్కడా అని అడిగా. వాటిని కూడా ప్యాక్ చేసినట్టు చెప్పింది. ఇప్పుడు బస్సులో ఎలా వెళ్లాలని అడిగితే.. తన షూ వేసుకెళ్లమని చెప్పింది. అప్పుడు ఆమె పింక్ స్లిప్పర్లు వేసుకుంది. ‘ఓరి దేవుడా.. ఇప్పుడు నేను పింక్ స్లిప్పర్లు వేసుకోవాలా?’ అనుకున్నా. అవి కనిపించకుండా బ్యాగ్‌ను అడ్డుపెట్టుకుని వచ్చా. కానీ, జట్టులోని కొందరు గమనించారు. చప్పట్లు కొడుతూ ఆటపట్టించారు. ఎయిర్‌పోర్టు వరకూ పింక్ స్లిప్పర్సే వేసుకున్నా. ఎయిర్‌పోర్టులో వేరేవి తీసుకున్నా.’ అని యువరాజ్ చెప్పుకొచ్చాడు. కాగా, 2016లో హాజెల్ కీచ్‌ను యువీ వివాహం చేసుకున్నాడు. యువీ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
- Tags
- #Yuvraj Singh