David Warner : ఆధార్ కార్డు కోసం వార్నర్ పరుగులు!.. వీడియో వైరల్

by Ramesh Goud |   ( Updated:2024-04-23 13:18:57.0  )
David Warner  : ఆధార్ కార్డు కోసం వార్నర్ పరుగులు!.. వీడియో వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ అభిమానుల్ని అలరించే స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఆధార్ కార్డు కోసం పరుగులు తీసిన వీడియో నెట్టంట వైరల్ గా మారింది. ఢిల్లీ క్యాపిటల్స్ సోషల్ మీడియాలో వార్నర్ నటించిన ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఇందులో వార్నర్ కు తన పక్కనే ఉన్న ఓ వ్యక్తికి మధ్య సంభాషణ ఇలా సాగింది. వార్నర్ మంచి మూవీ వచ్చింది చూద్దాం చలో!, ఫ్రీగా మంచి భోజనం పెడుతున్నారు తిందాం చలో!, అంటూ పలు ఆఫర్ల గురించి చెబుతాడు. వార్నర్ ప్రతీ దానికి "నహీ యార్" అంటుంటాడు.

చివరగా అతడు వార్నర్ ఫ్రీగా ఆధార్ కార్డు ఇస్తున్నారు అనగానే.. వార్నర్ చలో.. చలో.. అంటూ ఆ వ్యక్తిని పైకి ఎత్తుకొని తీసుకెళుతుంటాడు. దీనికి సంబందించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇది చూసిన నెటిజన్లు వార్నర్ ఆటగాడే కాదు, మంచి నటుడు కూడా అని, బహుషా! వార్నర్ ఇండియన్ సిటిజన్ షిప్ కోసం ప్రయత్నిస్తున్నట్లు ఉన్నాడు అని ఒకరు అంటే, మరోకరు నరేంద్ర మోడీ సార్ దయచేసి వార్నర్ కు ఒక ఆధార్ కార్డు ఇవ్వండి! అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.

Click Here For Twitter video

Advertisement

Next Story

Most Viewed