రిటైర్మెంట్ ప్రకటించిన వార్నర్.. అదే చివరి సిరీస్

by Shiva |   ( Updated:2023-06-04 04:40:17.0  )
రిటైర్మెంట్ ప్రకటించిన వార్నర్.. అదే చివరి సిరీస్
X

దిశ, వెబ్ డెస్క్ : ఇటీవలే క్రికెట్ ఆస్ట్రేలియా తీరుపై అసహనం వ్యక్తం చేసిన ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ మరో కీలక ప్రకటన చేశాడు. 2024లో జనవరిలో పాకిస్థాన్‌తో జరగనున్న టెస్టు సిరీస్ అతనికి చివరిదని వెల్లడించాడు. తన సొంత మైదానం సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో తన చివరి మ్యాచ్ ఆడనున్నట్లు ప్రకటించాడు. మరో నాలుగు రోజుల్లో వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన వార్నర్ తన రిటైర్మెంట్ నిర్ణయం ప్రకటించి అందరనీ ఆశ్చర్యపరిచాడు. 2024 జనవరిలో ఆసీస్ జట్టు, పాకిస్థాన్‌తో టెస్టు సిరీస్ ముగిశాక వెస్టిండీస్‌తో తలపడనుంది. ఆయన ఆ మ్యాచ్ లో తాను ఆడబోనని ఈ లెఫ్ట్ హ్యాండర్ ముందే స్పష్టం చేశాడు.

Read More: బ్యాటింగ్, బౌలింగ్ చేయకుండానే టెస్ట్ గెలిచి చరిత్ర సృష్టించిన బెన్ స్టోక్స్

Advertisement

Next Story