- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫాస్ట్ బౌలర్ అవ్వాలనుకొని.. స్పిన్ బౌలర్ అయిపోయా: రవీంద్ర జడేజా
దిశ, వెబ్ డెస్క్: రవీంద్ర జడేజా టీమిండియాలో కీలక ఆల్ రౌండర్. పదునైన స్పిన్ బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడుతూ.. అవసరమైనప్పుడు బ్యాటింగ్‌లోనూ రాణిస్తూ జట్టును ఆదుకోవడం అతని స్పెషాలిటీ. మోకాలి శస్త్రచికిత్స తర్వాత మళ్లీ భారత జట్టులో పునరాగమనం చేసిన అతను వరుసగా 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ' అవార్డులు అందుకుంటున్నాడు. ఆసీస్‌తో జరిగిన తొలి రెండు టెస్టుల్లో అవార్డు జడ్డూకే దక్కింది. ఇంత అద్భుతంగా ఆడుతున్న జడ్డూ ఇప్పుడు ఒక షాకింగ్ న్యూస్ వెల్లడించాడు. ఐపీఎల్ 2023 ప్రారంభానికి సన్నాహకంగా జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. తను క్రికెట్ ఆడటం మొదలు పెట్టినప్పుడు ఫాస్ట్ బౌలర్ అవ్వాలని అనుకున్నట్లు చెప్పాడు.
కానీ తన వద్ద దానికి సరిపోయే పేస్ లేకపోవడంతో వెనకడుగు వేశానని గుర్తుచేసుకున్నాడు. 'నేను చాలా కాలం క్రితం క్రికెట్ ఆడటం మొదలు పెట్టినప్పుడు ఫాస్ట్ బౌలర్ అవ్వాలని అనుకున్నా. మిగతా పేసర్లు బౌన్సర్లు వేయడం బాగా నచ్చేది. నేను కూడా అలాగే వేయాలని చాలా గట్టిగా అనుకునేవాడిని. కానీ నా దగ్గర పేస్ బౌలర్ అయ్యే వేగం లేదు' అని చెప్పుకొచ్చాడు. అలాగే తన క్రికెట్ జర్నీని ఇద్దరు మహేంద్రులు బాగా ప్రభావితం చేశారని గుర్తుచేసుకున్నాడు. జామ్‌నగర్‌లో నా కోచ్ మహేంద్ర సింగ్ చౌహాన్‌తో నా జర్నీ మొదలైంది. ఇప్పుడు సీఎస్‌కేలో మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో సాగుతోంది. నా క్రికెట్ అంతా ఇలా ఇద్దరు మహేంద్రుల మధ్యనే సాగిందన్నాడు' అని తెలిపాడు.
- Tags
- Ravindra Jadeja