- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంగ్లాండ్ పై యంగ్ టీమ్ ది అద్భుత విజయం.. కుర్రాళ్లపై కోహ్లీ ప్రశంసలు
దిశ, స్పోర్ట్స్: స్వదేశంలో ఇంగ్లాండ్ తో జరిగిన టెస్టు సిరీస్ లో టీమిండియా ఘనవిజయం సాధించింది. సిరీస్ విజయంపై భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ స్పందించాడు. ఇంగ్లాండ్ పై యంగ్ టీం అద్భుత విజయం సాధించిందని ప్రశంసించారు. ప్లేయర్ల సంకల్పం, పట్టుదల, అంకితభావమే..కఠిన సవాళ్లను దాటి సిరీస్ గెలిచారని కోహ్లీ కొనియాడాడు.
కాగా స్వదేశంలో ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు కోహ్లి దూరమయ్యాడు. తన భార్య అనుష్క శర్మ తమ రెండో బిడ్డ అకాయ్ కు జన్మనిచ్చింది. ఇందుకోసం అతడు టెస్టు సిరీస్ కు దూరమయ్యాడు. మరోవైపు దాదాపు 13 ఏళ్ల తర్వాత కోహ్లీ లేకుండా టీమిండియా తొలిసారి టెస్టు సిరీస్ లో బరిలో దిగింది. గాయం వల్ల కేఎల్ రాహుల్, ఫిట్ నెస్ సమస్యలతో శ్రేయస్ అయ్యర్ మ్యాచ్ కు దూరమయ్యాడు. ఇలాంటి టైంలో కుర్రాళ్లలతో ఐదు టెస్టుల సిరీస్ లో 3-1తో సిరీస్ ని ఎగరేసుకుపోయింది టీమిండియా.
తొలి ఇన్నింగ్స్‌లో 90 పరుగులతో అదరగొట్టాడు ధ్రువ్ జురైల్. సెకండ్ ఇన్నింగ్స్ లో 39 పరుగులతో రాణించాడు. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ అర్ధసెంచరీలతో రాణించారు. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్, అశ్విన్, జడేజా మినహా ఈ జట్టులో అందరూ పాతిక లోపు యంగ్ ప్లేయర్లే. మార్చి7న ధర్మశాల వేదికగా చివరి టెస్టు మ్యాచ్ జరగనుంది.