కోహ్లీని దగ్గరి నుంచి చూసిన వ్యక్తిగా చెబుతున్నా.. అతనే బెస్ట్ : దినేశ్ కార్తీక్

by Harish |
కోహ్లీని దగ్గరి నుంచి చూసిన వ్యక్తిగా చెబుతున్నా.. అతనే బెస్ట్ : దినేశ్ కార్తీక్
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్‌లలో అత్యుత్తమ టెస్టు బ్యాటర్ ఎవరు? అన్న చర్చ ప్రస్తుత క్రికెట్ వర్గాల్లో జరుగుతోంది. ఇటీవల శ్రీలంకతో టెస్టు సిరీస్‌లో జో రూట్ వరుస శతకాలు బాదడంతో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ రూటే బెస్ట్ అంటూ వ్యాఖ్యలు చేయడంతో ఈ చర్చ మొదలైంది. అదే చర్చలో పాల్గొన్న ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ మాత్రం మైకేల్ వాన్ వ్యాఖ్యలతో ఏకీభవించలేదు. కోహ్లీనే అత్యుత్తమమని తెలిపాడు.

తాజాగా దీనిపై భారత మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ స్పందించాడు. కార్తీక్ కూడా విరాటే బెస్ట్ అని చెప్పాడు. ఫార్మాట్లతో సంబంధం లేకుండా అతనే అత్యుత్తమ క్రికెటర్ అని వ్యాఖ్యానించాడు. ‘ప్రస్తుతం గణాంకాలు జో రూట్ అని చెప్పొచ్చు. కానీ, నా హృదయం మరొకరు అని చెబుతుంది. అతనే కోహ్లీ. దాదాపు దశాబ్దానికిపైగా కోహ్లీతో కలిసి ఆడాను. పెద్ద మ్యాచ్‌లను, బిగ్ సిరీస్‌లను అతను ఎలా ఆడతాడో నాకు తెలుసు. ఎవరైనా అతన్ని ప్రశ్నిస్తే అతను బలంగా వస్తాడు. ‘నేను ఆ ప్రశ్న ఎందుకు అడిగాను’ అనేలా చేస్తాడు. జీవితాంతం ఎవరు బ్యాటింగ్ చేస్తారని ఎవరైనా అడిగితే దానికి సమాధానం కోహ్లీ. అందులో ఎలాంటి సందేహం లేదు.’ అని తెలిపాడు. టెస్టుల్లో ప్రస్తుతం రూట్ 34 శతకాలు బాదగా.. కోహ్లీ 29 సెంచరీలు చేశాడు.

Advertisement

Next Story

Most Viewed