- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఐపీఎల్ అందరికీ నచ్చడానికి కారణమదే : విరాట్ కోహ్లీ
దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్‌లో ఆటగాళ్లకు, అభిమానులకు మధ్య మంచి కనెక్షన్ ఉంటుందని, ఐపీఎల్ అందరికీ నచ్చడానికి కారణమదేనని టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తెలిపాడు. తాజాగా స్టార్ స్పోర్ట్స్‌తో కోహ్లీ మాట్లాడుతూ.. ‘నేను ఐపీఎల్‌ను ప్రేమిస్తాను. అందుకు స్నేహ బంధం కూడా ఒక కారణం. చాలా మంది కొత్త ఆటగాళ్లతో మనం ఆడతాం. అందులో మనకు తెలిసిన చాలా మందిది మనం దేశం కాదు. వారిని మీరు తరుచుగా చూడలేం. అయితే, ప్రతి ఒక్కరూ ఐపీఎల్‌ను ఇష్టపడటానికి ఓ కారణం ఉంది. ఆటగాళ్లకు, అభిమానులకు కనెక్షన్ ఉంటుంది.’ అని తెలిపాడు.
ఇతర క్రికెట్ టోర్నీలుగానీ, ఐసీసీ ఈవెంట్లలోగానీ ఇతర జట్ల ఆటగాళ్లతో తరుచుగా గా ఇంటరాక్ట్ అవ్వరని చెప్పాడు. ‘కానీ ఐపీఎల్ అలా కాదు. రెండు, మూడు రోజులకోసారి ప్రతి జట్టును కలుసుకుంటారు. విభిన్న పరిస్థితుల్లో వేరే జట్టుతో వేరే సిటీలో ఆడతారు. టోర్నీలో ప్రతి ఒక్కరిలో ఏదో రకమైన సంకల్పం ఉంటుంది. ఏదో ఒక దశలో మ్యాజికల్ మూమెంట్స్ సృష్టించబడతాయి.’ అని విరాట్ చెప్పుకొచ్చాడు. కాగా, ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌కు దూరంగా ఉన్న కోహ్లీ ఐపీఎల్‌తో మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. ఈ నెల 22న ఐపీఎల్ ప్రారంభం కానుండగా.. ఓపెనింగ్ మ్యాచ్‌లో చెన్నయ్ సూపర్ కింగ్స్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది.
- Tags
- #IPL
- #Virat Kohli