- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
వికెట్ల మధ్య చిరుతలా పరుగెత్తేది వాళ్లే.. విరాట్ కోహ్లీ
దిశ, వెబ్‌డెస్క్: డివిలియర్స్‌తో 360 షోలో టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. క్రికెట్‌లో వికెట్ల మధ్య వేగంగా పరుగెత్తే వాళ్లు ఎవరో చెప్పాడు. అందులో ఒకరు టీమిండియా మాజీ కెప్టెన్ ఎమ్‌ఎస్ ధోనీ కాగా.. మరొకరు అతని ఆర్సీబీ మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ అని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. ధోనీ, డివిలియర్స్‌పై కోహ్లి ప్రశంసలు కురిపించాడు. వారు వికెట్ల మధ్య చిరుతలా పరుగెత్తుతారని.. అయితే చెత్తగా పరుగెత్తే ప్లేయర్ పుజారా అన్ని సరదాగా అన్నాడు.
నాతో కలిసి ఆడిన వాళ్లలో ఎలాంటి సందేహం లేకుండా ఏబీ డివిలియర్స్ వికెట్ల మధ్య అత్యంత వేగంగా పరుగెత్తే వ్యక్తి. ఇక అతని స్థాయి మరో వ్యక్తి ధోనీ మాత్రమే. వికెట్ల మధ్య వాళ్లు ఎంత వేగంగా పరుగెత్తుతారన్నది నాకు తెలియదు కానీ వాళ్లతో ఆడుతుంటే పరుగు కోసం పిలవాల్సిన అవసరం కూడా ఉండదని కోహ్లీ అన్నాడు. 2018లో సౌతాఫ్రికా టూర్‌లో ఉన్నప్పుడు జరిగిన ఓ సంఘటన గురించి కూడా వివరించాడు. టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో పుజారా తన సహచరున్ని రనౌట్ చేయగా.. రెండో ఇన్నింగ్స్‌లో తానే రనౌట్ కావడం విశేషం.