Virat Kohli :రూ.1,000 కోట్ల మార్క్ దాటిన విరాట్ ఆస్తులు..!

by Shiva |   ( Updated:2023-06-20 06:36:42.0  )
Virat Kohli :రూ.1,000 కోట్ల మార్క్ దాటిన విరాట్ ఆస్తులు..!
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రపంచ మేటి క్రికెటర్, భారత్ స్టార్ బాట్స్ మెన్ విరాట్ కోహ్లీ ఆస్తులు రూ.వేయి కోట్ల మార్క్ ను దాటేశాయి. అతడి ఆస్తుల విలువ రూ.వేయి 50 కోట్లుగా తేలింది. స్టాక్‌గ్రో అనే కంపెనీ విరాట్ ఆస్తులపై తాజాగా ఆసక్తికర విషయాలు వెల్లడించింది. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం టీమిండియా కాంట్రాక్ట్‌ ద్వారా బీసీసీఐ నుంచి రూ.7 కోట్లు లభిస్తుంది. అదేవిధంగా ఒక్కో టెస్ట్ మ్యాచ్ కు గాను రూ.15 లక్షలు, ఒక్కో వన్డేకు రూ.6 లక్షలు, ఒక్కో టీ20 మ్యాచ్‌కు రూ.3 లక్షల ఫీజుగా విరాట్‌ కోహ్లీ తీసుకుంటున్నాడు.

ఇక ఐపీఎల్‌ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడుతున్న తనకు ఏడాదికి గాను రూ.15 కోట్లను తీసుకుంటున్నాడు. విరాట్‌ కోహ్లీకి సొంతంగా కూడా బ్లూట్రైబ్‌, యూనివర్సల్‌ స్పోర్ట్స్‌బిజ్‌, ఎంపీఎల్‌, స్పోర్ట్స్‌ కాన్వో లాంటి సొంత బ్రాండ్లు కూడా ఉన్నాయి. కోహ్లీ మొత్తం 18 సంస్థల ప్రాడక్టులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా ఉన్నాడు. ఒక్కో యాడ్ కు రూ.10 కోట్ల వరకు వసూలు చేస్తున్నాడు. ప్రకటనలకు ప్రచారకర్తగా ఉండటం ద్వారా విరాట్‌ కోహ్లీ ఏటా దాదాపు రూ.175 కోట్లను సంపాదిస్తున్నాడు.

Read more : ఒక్కసారి కూడా స్టంపౌట్ కాక ముందు వేల రన్స్ చేసిన ప్లేయర్లు వీరే..!

Advertisement

Next Story