- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫ్రెండ్లీ రిక్వెస్ట్.. వరల్డ్ కప్ టికెట్లను నన్ను అడగవద్దు : Virat Kohli
న్యూఢిల్లీ : ఐసీసీ వన్డే ప్రపంచ కప్ సమరానికి టీమిండియా సిద్ధమైంది. అక్టోబర్ 08న తమ మొదటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ క్రమంలోనే రన్ మెషిన్ విరాట్ కోహ్లీ.. తన స్నేహితులను వినయపూర్వకంగా అభ్యర్థించాడు. సాధారణంగానే ప్రపంచకప్ జరిగిన ప్రతిసారి ఆటగాళ్ల కుటుంబ సభ్యులు, స్నేహితులు టిక్కెట్ల కోసం అడుగుతారు. ఈసారి కూడా అలాంటి పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉందని అర్థం చేసుకున్న కోహ్లి.. కాస్త ఫన్, ఇంకాస్త సీరియస్‌ను జోడిస్తూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీని పోస్ట్ చేశాడు.
‘మేము ప్రపంచ కప్ ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నందున టోర్నమెంట్‌లో టిక్కెట్ల కోసం నన్ను రిక్వెస్ట్ చేయొద్దని ఫ్రెండ్స్ అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నాను. మీ ఇంట్లో నుంచే మ్యాచ్‌లను ఆస్వాదించండది.. ప్లీజ్’ అంటూ మైక్రో బ్లాగింగ్ పోర్టల్‌లో పేర్కొన్నాడు కోహ్లీ. ఇదే క్రమంలో స్థానిక అభిమానుల కోసం రాష్ట్ర క్రికెట్ బోర్డు మ్యాచ్‌ల ఆఫ్‌లైన్ టిక్కెట్లను విక్రయిస్తుందని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (HPCA) కార్యదర్శి అవ్నీష్ పర్మార్ తెలిపారు.
Also Read: ఎప్పుడూ కోరుకున్నది దక్కదు : Rohit Sharma