రెండోసారి తండ్రి అయిన విరాట్ కోహ్లీ.. పాకిస్థాన్‌లో భారీ ఎత్తున సెలబ్రేషన్స్

by Satheesh |   ( Updated:2024-02-21 10:08:59.0  )
రెండోసారి తండ్రి అయిన విరాట్ కోహ్లీ.. పాకిస్థాన్‌లో భారీ ఎత్తున సెలబ్రేషన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు మరోసారి తల్లిదండ్రులు అయ్యారు. విరాట్ సతీమణి అనుష్క శర్మ ఫిబ్రవరి 15వ తేదీన పండంటి మగబిడ్డకు జన్మిచ్చారు. విరుష్క జోడీ బాబుకు ‘అకాయ్’గా నామకరణం చేశారు. గత కొంతకాలంగా విరుష్క దంపతులు మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. అనుష్క శర్మ పలుచోట్ల బేబి బంప్‌తో కనిపించారు. అయినప్పటికీ కోహ్లీ కానీ అనుష్క కానీ ఎక్కడ ఈ విషయంపై స్పందించలేదు. అనుహ్యంగా తాము రెండవసారి తల్లిదండ్రులం అయిన సంతోషకర విషయాన్ని కోహ్లీ, అనుష్క శర్మ ఫిబ్రవరి 20వ తేదీన సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. కోహ్లీ దంపతులకు పండంటి మగబిడ్డ పుట్టడంతో విరాట్ అభిమానుల సంతోషానికి హద్దే లేకుండా పోయింది. ‘జూనియర్ విరాట్’ వచ్చాడంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే, కోహ్లీ తన ఆటతో కేవలం భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు.

క్రికెట్ గురించి తెలిసిన అన్ని దేశాల్లో కోహ్లీకి అభిమానులు ఉన్నారంటే అతియోశక్తి కాదు. కోహ్లీ తన ఆట, యాటిట్యూడ్‌తో అంత మంది అభిమానులను సంపాదించుకున్నాడు. భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌లో కోహ్లీకి విపరీతంగా అభిమానులు ఉన్నారు. దాయాది దేశంలోనూ విరాట్ కోహ్లీని పాక్ అభిమానులు పెద్ద ఎత్తున ఆరాధిస్తారు. ఈ నేపథ్యంలో కోహ్లీ రెండవసారి తండ్రి కావడంతో పాకిస్థాన్‌లోని ఆయన అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. తాము రెండవసారి తల్లిదండ్రులమైనట్లు కోహ్లీ దంపతులు ప్రకటించడంతో పాక్‌లోని విరాట్ ఫ్యాన్స్ మంగళవారం స్వీట్లు పంచి సంబరాలు చేశారు. పాక్‌లోని మరికొన్ని ప్రాంతాల్లో విరాట్ ఫ్యాన్స్ బాణా సంచా పేల్చి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. కోహ్లీ పాక్ అభిమానుల సెలబ్రేషన్ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Advertisement

Next Story

Most Viewed