Vinesh Phogat : వినేశ్ ఫోగట్ కు అస్వస్థత

by M.Rajitha |
Vinesh Phogat  : వినేశ్ ఫోగట్ కు అస్వస్థత
X

దిశ, వెబ్ డెస్క్ : భారత రెజ్లర్, ఒలంపిక్ క్రెడాకారిని వినేష్ ఫొగాట్ అస్వస్థతకు గురైంది. ఒలంపిక్ అనంతరం పారిస్ నుండి ఢిల్లీ మీదుగా హర్యానా చేరుకున్న వినేష్ కు తన స్వస్థలం బలాలిలో ఘన స్వాగతం లభించింది. అయితే ఏమాత్రం విశ్రాంతి లేకుండా సుధీర్ఘ ప్రయాణం చేసిన వినేష్ కాస్త అస్వస్థతకు గురైంది. ఢిల్లీ ఎయిర్ పోర్టులో దిగినప్పటి నుండి బలాలి చేరుకునే వరకు అడుగడుగునా అభిమానులు నీరాజనం పట్టారు. అక్కడక్కడా ఆగుతూ అందర్నీ కలుస్తూ స్వగ్రామం చేరేసరికి, వినేష్ 13 గంటలకు పైగా విశ్రాంతి లేకుండా గడపాల్సి వచ్చింది. బలాలిలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశం జరుగుతుండగానే వినేష్ అస్వస్థతకు గురై కుర్చీలో వెనక్కి వాలిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో హాల్ చల్ చేశాయి. పక్కనే ఉన్న వినేష్ పెదనాన్న మహావీర్ ఫొగాట్, బజరంగ్ పునియా సపర్యాలు చేయడంతో కాస్త తెరుకుని మిగతా కార్యక్రమం సజావుగా జరిగింది.

Next Story

Most Viewed