Vinesh Phogat: హర్యానా ఎన్నికల బరిలో వినేష్ ఫొగాట్!

by M.Rajitha |   ( Updated:2024-08-20 11:43:59.0  )
Vinesh Phogat: హర్యానా ఎన్నికల బరిలో వినేష్ ఫొగాట్!
X

దిశ, వెబ్ డెస్క్ : అనూహ్యంగా ఒలంపిక్స్ లో అనర్హత వేటుకు గురైన భారత స్టార్ రెజ్లర్ ఎన్నికల్లో పోటీ చేయనుందా? అది జరగవచ్చు అంటున్నారు ఆమె సన్నిహితులు. అనర్హత వేటు ఎదుర్కొన్న తర్వాత వినేష్ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వినేష్ భవిష్యత్తు ఏమిటి అనే ప్రశ్నలు అందరి మెదళ్లను తొలుస్తున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం వినేష్ రానున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనుందని తెలుస్తోంది. బీజేపీలో చేరిన తన సోదరి బబిత ఫొగాట్ మీద పోటీ చేయనున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాను రాజకీయాల్లోకి రాను అని గతంలో వినేష్ ప్రకటించినప్పటికీ, ఎలాగైనా ఆమెకు నచ్చజెప్పి రాజకీయాల్లోకి తీసుకు రావాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని వినేష్ సన్నిహితులు చెప్పుకొచ్చారు. బబిత బీజేపీ నుండి పోటీ చేస్తున్నందున, వినేష్ ను పలువురు కాంగ్రెస్ నేతలు తమ పార్టీ నుండి పోటీ చేయించడానికి మంతనాలు సాగిస్తున్నారట. ఒకవేళ అదే నిజమైతే హర్యానా ఎన్నికలు ఒలంపిక్స్ అంతటి ఉత్కంఠభరితంగా మారతాయని అంటున్నారు విశ్లేషకులు. కాగా హర్యానా ఎన్నికలు అక్టోబర్ 1న జరగనున్నాయి.

Advertisement

Next Story