పతకం సాధించే వరకు ఆడుతా.. రిటైర్మెంట్‌పై వెనక్కి తగ్గిన వినేశ్ ఫొగట్

by Gantepaka Srikanth |
పతకం సాధించే వరకు ఆడుతా.. రిటైర్మెంట్‌పై వెనక్కి తగ్గిన వినేశ్ ఫొగట్
X

దిశ, వెబ్‌డెస్క్: అనర్హత వేటు కారణంగా పారిస్ ఒలంపిక్స్-2024లో పతకం కోల్పోయిన వినేశ్ ఫొగట్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రిటైర్మెంట్‌పై వెనక్కి తగ్గారు. ఈ విషయాన్ని శుక్రవారం ప్రకటించారు. ‘నేను సాధించాలనుకున్నది సాధించలేకపోయా. 2032 వరకు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఆడి తీరుతా. కచ్చితంగా ఒలంపిక్స్‌లో పతకం సాధిస్తా’ అని వినేశ్ ఫొగట్ ధీమా వ్యక్తం చేశారు. కాగా, ఒలంపిక్స్‌లో అనర్హత వేటు అనంతరం రెజ్లింగ్‌కు వినేశ్ ఫొగట్ గుడ్ బై చెప్పారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా(ఎక్స్) వేదికగా తన నిర్ణయాన్ని ప్రకటించారు. 'నాపై రెజ్లింగ్ గెలిచింది.. నేను ఓడిపోయాను. నా ధైర్యం ఓడింది.. నాకు ఇంక బలం లేదు. గుడ్ బై రెజ్లింగ్ 2001-2024' అంటూ ట్వీట్ చేశారు. తాజాగా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించడంతో ఆమె ఫ్యాన్స్‌ అంతా హ్యాపీగా ఫీలవుతున్నారు.

Advertisement

Next Story