దాని కోసం రెండేళ్లు కష్టపడ్డా : స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి

by Harish |
దాని కోసం రెండేళ్లు కష్టపడ్డా : స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి
X

దిశ, స్పోర్ట్స్ : దాదాపు మూడేళ్ల తర్వాత భారత జట్టులోకి వచ్చిన స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి బంగ్లాదేశ్‌తో తొలి టీ20లో సత్తాచాటాడు. మూడు వికెట్లు పడగొట్టి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ అనంతరం వరుణ్ తన ప్రదర్శనపై మాట్లాడుతూ విజయ రహస్యాన్ని రివీల్ చేశాడు. రెండేళ్ల కష్టానికి ఇది ఫలితమని చెప్పాడు. సైడ్ స్పిన్ బౌలింగ్ నుంచి ఓవర్ స్పిన్ బౌలింగ్‌కు మారడం తనకు ఉపయోగపడిందని తెలిపాడు.

‘మొదట్లో నేను సైడ్ స్పిన్ బౌలింగ్ చేసేవాడిని. కానీ, ఇప్పుడు పూర్తిగా ఓవర్ స్పిన్ బౌలర్‌గా మారాను. స్పిన్ బౌలింగ్‌లో ఇది ఒక నిమిషం సాంకేతిక అంశమే. కానీ, నాకు రెండేళ్ల కంటే ఎక్కువ సమయం పట్టింది. మొదట తమిళనాడు ప్రీమియర్ లీగ్, ఐపీఎల్‌లో ప్రయత్నించా.’ అని వరుణ్ చెప్పుకొచ్చాడు. 2021లో జరిగిన టీ20 వరల్డ్ కప్‌ తర్వాత జట్టులో పూర్తిగా చోటు కోల్పోయిన అతను మూడేళ్ల తర్వాత జట్టులోకి వచ్చాడు. రీఎంట్రీ మ్యాచ్‌లో బంగ్లాపై తానేంటో నిరూపించుకున్నాడు. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఆడుతున్న వరుణ్.. ఈ సీజన్‌లో కేకేఆర్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. 14 ఇన్నింగ్స్‌ల్లో 21 వికెట్లు పడగొట్టి కేకేఆర్ తరపున టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు.

Advertisement

Next Story

Most Viewed