యూఎస్ ఓపెన్‌లో ప్రీక్వార్టర్స్‌‌కు దూసుకెళ్లిన బోపన్న జోడీ

by Harish |
యూఎస్ ఓపెన్‌లో ప్రీక్వార్టర్స్‌‌కు దూసుకెళ్లిన బోపన్న జోడీ
X

దిశ, స్పోర్ట్స్ : భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న 43 ఏళ్ల వయసులోనూ అదరగొడుతున్నాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్ నెగ్గిన అతను యూఎస్ ఓపెన్ టైటిల్‌పై కన్నేశాడు. శనివారం పురుషుల డబుల్స్‌లో మాథ్యూ ఎబ్డెన్(ఆస్ట్రేలియా)తో కలిసి ప్రీక్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. రెండో రౌండ్‌లో బోపన్న-ఎబ్డెన్ జోడీ 6-2, 6-4 తేడాతో రాబర్టో కార్బలెస్(స్పెయిన్)-ఫెడెరికో కొరియా(అర్జెంటీనా) ద్వయాన్ని చిత్తు చేసింది. 5 ఏస్‌లు, 30 విన్నర్లతో చెలరేగిన బోపన్న జోడీ మూడుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌లను బ్రేక్ చేయడంతోపాటు వరుస సెట్లలో మ్యాచ్‌ను గెలుచుకుంది. మిక్స్‌డ్ డబుల్స్‌లో కూడా బోపన్న ప్రీక్వార్టర్స్‌కు చేరుకున్నాడు. ఇండోనేషియా క్రీడాకారిణి అల్దిలా సుట్జియాడితో కలిసి టోర్నీలో శుభారంభం చేశాడు. తొలి రౌండ్‌లో బోపన్న-సుట్జియాడి జంట 7-6(9-7), 7-6(7-5) తేడాతో టిమ్ పట్జ్(జర్మనీ)-డెమీ షుర్స్(నెదర్లాండ్స్) జోడీని ఓడించి రెండో రౌండ్‌కు చేరుకుంది.

Advertisement

Next Story

Most Viewed