- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యువ భారత్‌కు ఐదో విజయం.. అండర్-19 వరల్డ్ కప్‌లో సెమీస్ అర్హత
దిశ, స్పోర్ట్స్ : ఐసీసీ అండర్-19 పురుషుల వరల్డ్ కప్‌లో భారత అండర్-19 జట్టుకు తిరుగులేకుండా పోయింది. సౌతాఫ్రికాలో జరుగుతున్న ఈ టోర్నీలో వరుసగా ఐదో విజయం సాధించడంతోపాటు సెమీస్‌కు దూసుకెళ్లింది. చివరి సూపర్-6 రౌండ్ మ్యాచ్‌లో నేపాల్‌ను చిత్తు చేసి సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో నేపాల్‌పై 132 పరుగుల తేడాతో యువ భారత్ విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లను కోల్పోయి 297 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన నేపాల్ నిర్ణీత ఓవర్లలో 165 పరుగులకే పరిమితమైంది. సామీ పాండే(4/29) మరోసారి బంతితో చెలరేగడంతో ప్రత్యర్థి బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూకట్టారు. కెప్టెన్ దేవ్ ఖనాల్(33) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 77 పరుగులకే 7 వికెట్లతో నేపాల్ ఆలౌట్ అంచున నిలిచిన సమయంలో దేవ్ ఖనాల్‌తోపాటు దుర్గేశ్ గుప్తా(29 నాటౌట్), ఆకాశ్ చంద్(19 నాటౌట్) గొప్ప పోరాటం చేశారు. నేపాల్ 100 లోపే కుప్పకూలుతుందనుకున్న స్థితి నుంచి 165 పరుగులు చేసి ఆలౌట్ ప్రమాదం నుంచి బయటపడింది. అయితే, భారత బౌలర్ల ధాటికి మిగతా బ్యాటర్లు తేలిపోవడంతో నేపాల్ చిత్తుగా ఓడింది. మంగళవారం జరిగే సెమీస్‌లో సౌతాఫ్రికాతో భారత్ తలపడనుంది.
శతక్కొట్టిన ఉదయ్, సచిన్
అంతకుముందు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు శుభారంభం దక్కలదేు. ఓపెనర్లు ఆదర్శ్ సింగ్(21), అర్షిన్ కులకర్ణి(18)తోపాటు ప్రియాన్ష్(19) స్వల్ప స్కోరుకే వెనుదిరగడంతో భారత్ 62/3తో నిలిచింది. ఈ సమయంలో కెప్టెన్ ఉదయ్ సహారన్(100), సచిన్ దాస్(116) సెంచరీలతో రెచ్చిపోయారు. నేపాల్ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన వీరు నాలుగో వికెట్‌కు ఏకంగా 215 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. వరుస ఓవర్లలో వీరిని గుల్సాన్ ఝా అవుట్ చేశాడు. ముషీర్ ఖాన్(9 నాటౌట్), అవనీశ(0 నాటౌట్) అజేయంగా నిలిచారు. నేపాల్ బౌలర్లలో గుల్సాన్ ఝా మూడు వికెట్లతో రాణించాడు.
సంక్షిప్త స్కోరు బోర్డు
భారత అండర్-19 ఇన్నింగ్స్ : 297/5(50 ఓవర్లు)
(ఉదయ్ సహారన్ 100, సచిన్ దాస్ 116, గుల్సాన్ ఝా 3/56)
నేపాల్ అండర్-19 ఇన్నింగ్స్ : 165/9(50 ఓవర్లు)
(దేవ్ ఖనాల్ 33, సౌమీ పాండే 4/29)