- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేడు భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య టీ 20 ప్రపంచకప్ అంతిమ సమరం
దిశ, వెబ్‌డెస్క్: టీ 20 ప్రపంచకప్2లో మెగా పోరులో రంగం సిద్ధమైంది. వెస్టిండీస్‌లోని బ్రిడ్జ్‌టౌన్ వేదికగా రాత్రి 8 గంటలకు ఫైనల్ మ్యాట్ జరగనుంది. టీ 20 ప్రపంచకప్‌లో భారత్ ఫైనల్ ఆడడం ఇది మూడోవసారి. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఎలాగైనా కప్ కొట్టి విశ్వవిజేతగా నిలవాలని ప్రతి ఒక్క భారతీయుడు ఆశిస్తు్న్నాడు. ఇక టీమిండియా 2007 లో తొలి టీ 20 ప్రపంచకప్‌లో విజేతగా భారత్ నిలిచింది. 2014 లో ఫైనల్లో శ్రీలంక చేతిలో ఓటమి చావిచూసింది. దక్షిణాఫ్రికా వన్డేల్లో, టీ 20 ఫైనల్ చేరడం రెండోసారి పొట్టి కప్పును ఒడిసిపట్టాలని పట్టుదలతో టీమ్ ఇండియా ఫైనల్‌కు చేరుకుంది. దక్షిణాఫ్రికా వన్డేల్లో, టీ 20 ల్లో ఫైనల్లో చేరడం ఇదే తొలిసారి. భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఇప్పటివరకు జరిగిన టీ 20 మ్యాచ్ 25, టీ 20 ల్లో టీమ్ ఇండియా 14 సార్లు.. దక్షిణాఫ్రికా 11 సార్లు విజయం సాధించింది. టీ 20 వరల్డ్ కప్ లో ఆరుసార్లు తలపడ్డ భారత్- దక్షిణాఫ్రికా.. భారత్ నాలుగింట్లో, దక్షిణాఫ్రికా రెండింట్లో గెలుపొందింది. 2019 వన్డే డబ్ల్యూసీ సెమీస్, 2022 టీ 20 డబ్ల్యూ సెమీస్, 2023 డబ్ల్యూటీసీ ఫైనల్, 2023 వన్డే డబ్ల్యూసీ ఫైనల్.. భారత్ చివరి వరకు వచ్చి ఒక్క అడుగు దూరంలో నిలిచింది. కప్పు కొడుతామని ఎంతో నమ్మకం పెట్టుకున్న ప్రతిసారి 140 కోట్ల మంది భారతీయుల ఆశలు ఆవిరైపోతున్నాయి. ఇక ఈసారి ఎలాగైనా కప్పు గెలుస్తామని భారతీయులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.