ప్రజల ప్రేమ.. 1,000 స్వర్ణ పతకాల కంటే ఎక్కువ.. ఎమోషనల్ అయిన వినేశ్ ఫొగట్

by Harish |
ప్రజల ప్రేమ.. 1,000 స్వర్ణ పతకాల కంటే ఎక్కువ.. ఎమోషనల్ అయిన వినేశ్ ఫొగట్
X

దిశ, స్పోర్ట్స్ : పారిస్ ఒలింపిక్స్‌లో భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్ అనర్హతకు గురైన విషయం తెలిసిందే. 50 కేజీల కేటగిరీలో పాల్గొన్న ఆమె ఫైనల్‌కు ముందు 100 గ్రాములు అదనపు బరువుతో పతకాన్ని కోల్పోయింది. జాయింట్ సిల్వర్ మెడల్ ఇవ్వాలన్న ఆమెకు కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్(కాస్)‌ కూడా నిరాశే ఎదురైంది. పారిస్ ఒలింపిక్స్ హార్ట్ బ్రేక్ తర్వాత వినేశ్ శనివారం స్వదేశానికి చేరుకుంది. ఢిల్లీ‌లోని ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్టులో ఆమెకు ఘన స్వాగతం దక్కింది.

అభిమానులు, కుటుంబసభ్యులు, ఇతర రెజ్లర్లు పెద్ద ఎత్తున్న ఆమెకు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు. తనకు స్వాగతం చెప్పేందుకు వచ్చిన అభిమానులను చూసి వినేశ్ భావోద్వేగానికి లోనైంది. కన్నీరు పెట్టుకుంది. ‘దేశ ప్రజలందరికీ ధన్యవాదాలు. నేను చాలా అదృష్టవంతురాలిని.’ అని తెలిపింది. ఆ తర్వాత ఢిల్లీలో స్టార్ రెజ్లర్లు బజరంగ్ పూనియా, సాక్షిమాలిక్‌లతోపాటు పలువురితో కలిసి వినేశ్ రోడ్ షో‌లో పాల్గొంది. అనంతరం ఆమె తన స్వస్థలమైన హర్యానాలోని బలాలీకి చేరుకుంది. ఈ సందర్భంగా వినేశ్ మాట్లాడుతూ.. ఎమోషనల్ అయ్యింది. అభిమానులకు కృతజ్ఞతలు చెప్పింది. ‘పారిస్ ఒలింపిక్స్‌లో నాకు గోల్డ్ మెడల్ ఇవ్వలేదు. కానీ, ప్రజలు నాకు అది ఇచ్చారు. వారి నుంచి నేను పొందిన ప్రేమ, గౌరవం 1,000 బంగారు పతకాల కంటే ఎక్కువ.’ అని తెలిపింది.

Advertisement

Next Story