ఐపీఎల్‌లో మరో కీలక పరిణామం.. లక్నోకు KL రాహుల్ గుడ్ బై.. తిరిగి సొంత గూటికే స్టార్ బ్యాటర్..?

by Satheesh |   ( Updated:2024-07-21 14:47:02.0  )
ఐపీఎల్‌లో మరో కీలక పరిణామం.. లక్నోకు KL రాహుల్ గుడ్ బై.. తిరిగి సొంత గూటికే స్టార్ బ్యాటర్..?
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 ప్రారంభోత్సవానికి ముందే క్రీడా వర్గాల్లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. దీనికి కారణం వచ్చే ఏడాది జరగబోయే ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో పలు కీలక పరిణామాలు జరగనుండటమే. టీమిండియాకు చెందిన పలువురు స్టార్ ప్లేయర్లు జట్లు మారబోతున్నట్లు వస్తోన్న వార్తలు నెక్ట్స్ సీజన్‌పై మరింత ఉత్కంఠ పెంచుతున్నాయి. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తోన్న టీమిండియా యంగ్ బ్యాటర్ రిషబ్ పంత్ ఢిల్లీకి గుడ్ బై చెప్పనున్నట్లు నేషనల్ మీడియాలో వార్తలు కోడైకూస్తున్నాయి. ఢిల్లీకి టాటా చెప్పి ఐపీఎల్ లీగ్‌లోనే మోస్ట్ క్రేజీయొస్ట్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్‌లోకి వెళ్లే యోచనలో పంత్ ఉన్నట్లు టాక్.

ఇదిలా ఉండగానే, మరో టీమిండియా స్టార్ ప్లేయర్ ఐపీఎల్ టీమ్ ఛేంజ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. లక్నో సూపర్ జైయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆ జట్టుకు వీడ్కోలు పలికే యోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. లక్నో మేనేజ్మెంట్‌కు రాహుల్‌కు మధ్య గ్యాప్ వచ్చిందని.. ఆ కారణంతోనే రాహుల్ జట్టును వీడనున్నట్లు సమాచారం. 2024 సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో లక్నో ఓ మ్యాచులో ఘోర ఓటమి చవిచూసింది. లక్నో ఓటమి అనంతరం ఆ ప్రాంఛైజ్ ఓనర్ సంజీవ్ గోయెంకా స్టేడియంలో బహిరంగంగానే రాహుల్‌పై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కనీసం రాహుల్ చెప్పే మాట కూడా వినకుండా గోయెంకా సీరియస్ అయ్యారు.

ఈ ఇష్యూ అప్పట్లో తీవ్ర దుమారమే రేపింది. దీంతో అప్పటి నుండి రాహుల్ మేనేజ్మెంట్‌‌పై ఆగ్రహంగా ఉన్నారని.. దీంతోనే ఆ జట్టును వీడాలని నిర్ణయం తీసుకున్నట్లు టాక్. అయితే, లక్నోను వీడనున్న రాహుల్.. తిరిగి సొంతగూడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి వెళ్లనున్నట్లు క్రీడా వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. కోహ్లీ తర్వాత అంతటి బలమైన ఇండియా ప్లేయర్ కోసం ఎదురుచూస్తోన్న ఆర్సీబీ.. ఈ ఏడాది జరగనున్న మెగా వేలంలో ఎంత ధర వెచ్చించి అయిన రాహుల్‌ను సొంత చేసుకోవాలని పట్టుదలతో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. కాగా, కర్నాటకకు చెందిన రాహుల్ గతంలో ఐపీఎల్‌లో ఆర్సీబీ ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే. పంత్, రాహుల్ మెగా వేలానికి రానున్నారన్న వార్తల నేపథ్యంలో ఐపీఎల్ బిడ్‌పై క్రికెట్ ప్రియుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Advertisement

Next Story

Most Viewed