మహిళల టీ20 వరల్డ్ కప్ వేదిక యూఏఈ

by M.Rajitha |
మహిళల టీ20 వరల్డ్ కప్ వేదిక యూఏఈ
X

దిశ, వెబ్ డెస్క్ : ఎట్టకేలకు మహిళల టీ20 వరల్డ్ కప్ వేదికను నిర్ణయించింది ఐసీసీ. బంగ్లాదేశ్ అల్లర్ల నేపథ్యంలో ఈ టోర్నీని బంగ్లాదేశ్ లో కాకుండా యూఏఈలో నిర్వహించనున్నట్టు ప్రకటించింది. అక్టోబర్ 3 నుండి 20 వరకు యూఏఈలోని షార్జా, దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ లు జరగనున్నాయి. ఇందులో పది జట్లు పాల్గొంటుండగా.. వాటిని రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-ఏ లో భారత్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, న్యూజిలాండ్ ఉండగా.. గ్రూప్-బీ లో బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, సౌత్ఆఫ్రికా, వెస్టిండీస్ ఉన్నాయి. రెండు గ్రూపుల నుండి టాప్ లో నిలిచిన జట్లు అక్టోబర్ 20న ఫైనల్స్ లో తలపడతాయి. కాగా సెప్టెంబర్ 27 నుండి వార్మప్ మ్యాచ్ లు జరగనున్నాయి.

Next Story