- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
VI: టెలికాం పరికరాల కోసం వోడాఫోన్ ఐడియా 3.6 బిలియన్ డాలర్ల ఒప్పందం
దిశ, బిజినెస్ బ్యూరో: నిధుల కొరత, అప్పులతో కష్టాల్లో ఉన్న టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా భారీ ఒప్పందం కుదుర్చుకుంది. నెట్‌వర్క్ పరికరాల సరఫరా కోసం నోకియా, ఎరిక్సన్, శాంసంగ్ కంపెనీలతో 3.6 బిలియన్ డాలర్ల(రూ. 30 కోట్ల కోట్లకు పైనే) విలువైన ఒప్పందం చేసుకుంది. మూడేళ్ల లక్ష్యంతో విస్తరణ కోసం ఉద్దేశించిన నిధుల వ్యయంలో ఇది మొదటి అడుగు అని కంపెనీ ఆదివారం అధికారిక ప్రకటనలో తెలిపింది. నెట్‌వర్క్ పరికరాల కోసం చేసుకున్న ఒప్పందంలో భాంగా 4జీ కవరేజీని పెంచడం, కీలక మార్కెట్లలో 5జీ నెట్‌వర్క్‌ను ప్రారంభించడం, పెరుగుతున్న డేటా వినియోగానికి అనుగుణంగా సామర్థ్యాన్ని పెంచడం వంటి అంశాలపై ఉంటుందని కంపెనీ తెలిపింది. తమకు ఇప్పటికే నోకియా, ఎరిక్సన్ కంపెనీలో సుధీర్ఘకాలం నుంచి భాగస్వామ్యం ఉందని, కొత్తగా శాంసంగ్‌లో ఒప్పందం కుదరడం సంతోషంగా ఉందని వొడాఫోన్ ఐడియా సీఈఓ అక్షయ మూండ్రా పేర్కొన్నారు.