- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Muttiah Muralitharan : వరల్డ్ కప్ ఫైనల్ కు చేరేదెవరో చెప్పేసిన స్పిన్ మాంత్రికుడు ...
దిశ, వెబ్ డెస్క్ : అక్టోబరు 5 నుంచి నవంబరు 19 వరకు జరగబోయే ఐసీసీ వన్డే వరల్డ్ కప్ కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ ఈవెంట్ లో మొత్తం 48 వన్డే మ్యాచ్‌లు జరగనుండగా, మొత్తం 46 రోజులు పాటు మెగా టోర్నీ సాగనుంది. ఇందుకు సంబంధించి షెడ్యూల్ ను ఐసీసీ మంగళవారం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆయా జట్లు తమ ప్రత్యర్థులను ఏవిధంగా ఎదుర్కొవాలో ఇప్పటి నుంచే వ్యూ్హాలు రచిస్తున్నారు. అదేవిధంగా సమష్టిగా రాణించి కప్ ను ఎగరేసుకెళ్లేందుకు తమ సర్వ శక్తులు ఒడ్డేందుకు సమయత్తమవుతున్నారు.
వరల్డ్ కప్ కు సంబంధించి ఏ జట్లు పటిష్టంగా ఉన్నాయి, ఏ ఆటగాళ్లు మ్యాచ్ లను ప్రభావితం చేయబోతున్నారనే విషయాలపై ఆయా జట్ల మాజీ క్రికెటర్లు ఇప్పటికే విష్లేశణ మొదలు పెట్టారు. తమ వ్యక్తి గత అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే శ్రీలంక మాజీ క్రికెటర్, స్పిన్ మాంత్రికుడు తన అభిప్రాయన్ని వెల్లిబుచ్చాడు. వరల్డ్ కప్ ఫైనల్ లో ఇండియా, ఇంగ్లాండ్ తలపడతాయని జోస్యం చెప్పాడు. ఖచ్చితంగా స్వదేశంలో జరగబోయే ఈ ఈవెంట్ భారత్ కు పెద్ద ప్లస్ పాయింట్ కానుందని తెలిపాడు. టైటిల్ ఫేవరెట్ లో ఆ జట్టు ఉంటుందని తెలిపాడు.