భారత్, బంగ్లాదేశ్‌ రెండో టెస్టు రెండో రోజు ఆట రద్దు

by Y. Venkata Narasimha Reddy |
భారత్, బంగ్లాదేశ్‌ రెండో టెస్టు రెండో రోజు ఆట రద్దు
X

దిశ, వెబ్ డెస్క్ : భారత్, బంగ్లాదేశ్‌ మధ్య కాన్పూర్ గ్రీన్‍పార్క్ స్టేడియం వేదికగా జరుగుతున్న జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు ఆట ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. ఉదయం నుంచి వర్షం పడుతున్న కారణంగా మైదానం చిత్తడిగా మారడంతో రెండో రోజు మ్యాచ్‌ నిర్వహణ సాధ్యపడలేదు. దీంతో మధ్యాహ్నం వరకు వేచి చూసి రెండో రోజు ఆటను రద్దు చేస్తున్నట్లుగా నిర్వాహకులు ప్రకటించారు. తొలిరోజు (శుక్రవారం) సైతం వర్షం కారణంగా ఆటను కొన్ని గంటల ముందే ముగించాల్సి వచ్చింది. తొలి రోజు వర్షంతో టాస్ ఆలస్యం కావడం..కేవలం 35ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. తొలి రోజు ఆటలో బంగ్లా జట్టు మూడు వికెట్లకు 107పరుగులు చేసింది. బంగ్లా బ్యాటర్లలో మోమినల్ 40, ముష్ఫికర్ 6పరుగులతో ఆడుతున్నారు. భారత ఆకాశ్ దీప్ 2, అశ్విన్ 1 వికెట్ తీశారు.

రెండో రోజు ఆట కూడా వర్షార్పణం కావడంతో ఈ మ్యాచ్ లో భారత్ విజయావకాశాలు సందేహంగా మారాయి. టెస్టు మూడో రోజైన రేపు (సెప్టెంబర్ 29) కూడా వాన ఆటంకాలు తప్పేలా లేవు. అక్యువెదర్ రిపోర్ట్ ప్రకారం, కాన్పూర్‌లో రేపు వాన పడే అవకాశాలు 59 శాతంగా ఉన్నాయి. ఇప్పటికే రెండు టెస్టుల సిరీస్‌లో ఒక టెస్టు గెలిచిన భారత్‌ 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది.

Advertisement

Next Story