- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ICC Rankings: టాప్ ప్లేస్ కోల్పోయిన టీమిండియా.. దూసుకొచ్చిన ఆస్ట్రేలియా
దిశ, వెబ్‌డెస్క్: ర్యాంకింగ్స్‌ను ఐసీసీ విడుదల చేసింది. అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన జట్ల ర్యాంకులను శుక్రవారం ఐసీసీ ప్రకటించింది. ఈ ర్యాంకింగ్స్‌లో రెండు ఫార్మాట్లలో టీమిండియా సత్తా చాటింది. వన్డేల్లో, టీ20ల్లో అగ్రస్థానాన్ని కాపాడుకుంది. టెస్టుల్లో మాత్రం టీమిండియాను వెనక్కి నెట్టి ఆస్ట్రేలియా మొదటి స్థానాన్ని దక్కించుకున్నది. టీ20ల్లో భారత్‌కు 264 పాయింట్లు ఉండగా.. 257 పాయింట్లతో ఆస్ట్రేలియా రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక వన్డేల్లో 122 పాయింట్లతో భారత్ మొదటి స్థానంలో ఉండగా.. 116 పాయింట్లతో మళ్లీ ఆస్ట్రేలియా రెండో స్థానంలో నిలిచింది. టెస్టుల్లో మాత్రం ఆస్ట్రేలియా 124 పాయింట్లతో ఫస్ట్ ప్లేస్‌లో ఉండగా.. 120 పాయింట్లతో భారత్ రెండో స్థానంలో దక్షిణాఫ్రికా(103), న్యూజిలాండ్(93) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్‌లో 2023-2025 సీజన్ పట్టికలో మాత్రం భారత్ టాప్ ప్లేస్‌లో నిలిచింది. రెండో స్థానంలో మళ్లీ ఆస్ట్రేలియా నిలిచింది. వచ్చే ఏడాది మార్చిలో ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ జరుగనుంది.