భారతీయుల ఆరాధ్యుడు.. అనితరసాధ్యుడు లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ (బర్త్‌‌డే స్పెషల్ స్టోరీ)

by Shiva |   ( Updated:2024-04-24 12:21:30.0  )
భారతీయుల ఆరాధ్యుడు.. అనితరసాధ్యుడు లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ (బర్త్‌‌డే స్పెషల్ స్టోరీ)
X

దిశ, వెబ్‌డెస్క్: ‘క్రికెట్’ భారతదేశ ప్రజల ఊపిరి, అదో జెంటిల్‌మెన్ గేమ్. 1982 వరకు క్రికెట్ అంటే చాలా తక్కువ మందికి తెలుసు. కానీ, 1983‌లో భారత జట్టు ప్రపంప కప్ గెలిచాక ఆ గేమ్ స్వరూపం పూర్తిగా మారిపోయింది. ఇంట్లో చిన్నోళ్లైన.. పెద్దోళ్లైనా ఆఖరికి ముసలివాళ్లైనా క్రికెట్‌ను చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. కపిల్ దేవ్, మొహిందర్ అమర్‌నాథ్, సునీల్ గవాస్కర్, వెంగ్‌సర్కర్, స్టువర్ట బిన్ని ఇలా చాలామంది లెజెంట్స్ తమ అత్యుత్తమ స్కిల్స్‌తో క్రికెట్‌‌లో సంచలనాలు మాత్రమే సృష్టించారు. అయితే, ఈ క్రమంలోనే 16 ఏళ్ల వయసులో క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఓ బక్కపలుచని కుర్రాడు అంతర్జాతీయ క్రికెట్‌ను 24 ఏళ్ల పాటు ఏలేశాడు అతడే లిటిల్ మాస్టర్ సచిన్ రమేష్ టెండూల్కర్. నేడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా సచిన్ జీవిత విశేషాలను తెలుసుకుందాం పదండి.

బాల్యంలోనే క్రికెట్‌పై మక్కువ..

సచిన్ టెండూల్కర్ 24 ఏప్రిల్ 1973‌లో బొంబాయిలోని దాదర్‌లోని నిర్మల్ నర్సింగ్ హోంలోని మహారాష్ట్ర కుటుంబంలో జన్మించాడు. అతడి తండ్రి రమేష్ టెండూల్కర్, మరాఠీ భాషా నవలా రచయిత, గొప్ప కవి. అతడి తల్లి రజని గృహిణి. సచిన్‌‌కు టెండుల్కర్‌కు ఇద్దరు అన్నలు, చెల్లి ఉన్నారు. వారే నితిన్ టెండుల్కర్, అజిత్ టెండుల్కర్, చెల్లెలు సవిత. సచిన్‌కు చిన్నప్పటి నుంచి క్రికెట్‌పై మక్కువ ఎక్కువ. దీంతో అతను పాఠశాల టోర్నమెంట్‌ పాల్గొంటూ మెరగైన ప్రదర్శన చేసి అనూహ్యంగా వెలుగులోకి వచ్చాడు.

అండర్-16లో చిచ్చరపిడుగులా..

ఒకానొక దశలో స్కూల్ టోర్నమెంట్‌లో భారత మాజీ బ్యాట్స్‌మెన్ వినోద్ కాంబ్లీ‌తో కలిసి సచిన్ 664 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పడాడు. అదే ఇన్నింగ్స్ సచిన్ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. అక్కడి నుంచి అతడు అండర్-16 ఆడటం మొదలు పెట్టాడు. అయితే, సచిన్ ప్రదర్శన భారత సెలెక్టర్లను ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో అతడిపై నమ్మకం ఉంచిన బీసీసీఐ 16 ఏళ్ల వయసులో అతడిని పాకిస్థాన్ పర్యటనకు ఎంపిక చేసింది. ఆ పర్యటనలో సచిన్.. పాక్ అత్యుత్తమ బౌలర్లు వసీం అక్రమ్, వకార్ యూనస్ లాంటి బౌలర్ల నిప్పులు చెరిగే బంతులను అలవోకగా ఎదుర్కొన్నారు. ఇప్పటికీ సచిన్ ముంబై రంజీ టీం ఆడుతాడంటే క్రికెట్‌పై ఉన్న ప్యాషన్, మక్కువ మనకు అర్థం అవుతోంది.

ఆరంభంలోనే అదుర్స్..

1992 న్యూజిలాండ్ పర్యాటనలో సచిన్‌కు జట్టు ఓపెనర్‌గా సువర్ణావకాశం దక్కింది. వచ్చిన అవకాశాన్ని ఏమాత్రం జారవిడవకుండా ప్రత్యర్థి బౌలర్లపై ఫోర్లు సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఒకనొక దశలో అతడు అందించిన చక్కని ఆరంభాలే జట్టుకు విజయాలను తెచ్చిపెట్టాయని అనడంలో సందేహాలు లేవు. అతడి ఫుట్ వర్క్, షాట్ సెలెక్షన్‌తో క్రికెట్ పండితుల చేత ఔరా అనిపించుకున్నాడు. అలా క్రికెట్ ప్రపంచాన్నే 24 ఏళ్ల పాటు ఏలేశాడు. ఇక 1996లో అపట్లో బలమైన జట్టుగా ఉన్న ఆస్ట్రేలియాపై సచిన్ చేసిన బ్యాక్ టూ బ్యాక్ సెంచరీలు సిరీస్‌న భారత్ కైవసం చేసుకునేలా చేశాయి. ఒకనొక దశలో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, పాకిస్థాన్, శ్రీలంక, న్యూజిల్యాండ్ బౌలర్లు సచిన్‌‌కు బౌలింగ్ వేయాలంటే జంకే వారు.

రికార్డులు పాదాక్రాంతం..

ఇక సచిన్ కెరీర్ విషయానికి వస్తే.. 200 టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడిన సచిన్ 329 ఇన్నింగ్స్‌లలో 15,921 పరుగులు చేశాడు. అందులో 51 సెంచరీలు, 6 డబుల్ సెంచరీలు, 65 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అదేవిధంగా వన్డేల్లో 463 మ్యాచ్‌లు ఆడిన లిటిల్ మాస్టర్ 452 ఇన్నింగ్స్‌లలో 18,426 పరుగులు చేశాడు. అందులో 49 సెంచరీలు, 1 డబుల్ సెంచరీ, 96 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్‌లో 100 సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌గా సచిన్ రికార్డు పుటల్లోకి ఎక్కాడు. ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న అత్యుత్తమ ఆటగాళ్లు కూడా ఎవరూ ఆయన రికార్డుకు దరిదాపుల్లో లేకపోడం విశేషం.

తన మొత్తం కెరీర్‌లో సచిన్ అనేక రికార్డులు సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 24 ఏళ్ల లాంగ్ కెరీర్‌ను క‌లిగిన ఏకైక క్రికెట‌ర్‌గా రికార్డ్ స‌చిన్‌ సొంతం. అదేవిధంగా అత్యధిక టెస్టు మ్యాచ్‌లు ఆడిన క్రికెట‌ర్‌గా 200 టెస్టులు ఆడిన గౌరవం అతడికే దక్కింది. అప్పట్లో డేంజరస్ జట్టు ఆస్ట్రేలియాపై 20 సెంచ‌రీలు చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్ స‌చిన్ ఒక్కడే కావడం విశేషం. అదేవిధంగా అతడు శ్రీలంక, ద‌క్షిణాఫ్రికాల‌పై ప‌దికిపైగా సెంచ‌రీలు సాధించాడు. అందుకే సచిన్ భారతీయుల ఆరాధ్య దైవం. అప్పట్లో మైదానాల్లో ప్రేక్షకులు సైన్ బోర్డులను ప్రదర్శించేవారు.. ‘క్రికెట్ ఓ మతం.. సచిన్ దేవుడు’ అని అవును నిజమే.. ఆ వ్యాఖ్యలు ముమ్మాటికీ అక్షర సత్యమే.

Advertisement

Next Story