ఆ బౌలర్ వేసిన బంతికి బ్యాట్ రెండు ముక్కలు..!

by Shiva |
ఆ బౌలర్ వేసిన బంతికి బ్యాట్ రెండు ముక్కలు..!
X

దిశ, వెబ్ డెస్క్: శ్రీలంక, న్యూజిలాండ్ మధ్య సిరీస్‌లో రెండో టీ20 న్యూజిలాండ్ తొమ్మిది వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించింది. మ్యాచ్ మధ్యలో ఓ విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ఆడమ్ మిల్నే వేసిన బంతికి శ్రీలంక బ్యాట్స్‌మెన్ పతుం నిస్సాంక బ్యాట్ విరిగిపోయింది. ఇప్పుడు ఆ వీడియో నెట్టింట్లో విపరీతంగా వైరల్ అవుతోంది. అఫీషియల్ బ్రాడ్ కాస్టర్ స్పార్క్ స్పోర్ట్స్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుంచి వీడియోను ట్వీట్ చేసింది. ఆడమ్ మిల్నే వేసిన బుల్లెట్ లాంటి బంతికి పతుం నిస్సాంక బ్యాట్ రెండు ముక్కలవడం ఆ వీడియోలో స్పష్టంగా కనబడుతోంది.

Advertisement

Next Story

Most Viewed