క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీ

by Mahesh |   ( Updated:2024-02-21 04:04:37.0  )
క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీ
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీతో కలిసి 2008 అండర్ -19 వరల్డ్ కప్‌లో ఆడిన తరువార్ కోహ్లీ అన్ని ఫార్మట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. తరువార్ మిజోరాం రాష్ట్ర జట్టు కెప్టెన్ గా కూడా బాధ్యతలు నిర్వహించారు. 35 సంవత్సరాల అతను.. తన ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో మొత్తం 55 మ్యాచులు ఆడాడు. ఇందులో 97 ఇన్నింగ్స్ లో 53.80 సగటుతో 4573 పరుగులు చేశాడు. ఇందులో మొత్తం 14 సెంచరీలతో పాటు.. 18 అర్థసెంచరీలు ఉన్నాయి. కాగా అతను తన కేరిర్ లో అత్యధిక పరుగులు 307 నాటౌట్ గా నిలిచాడు. దీంతో పాటు రెండు డబుల్ సెంచరీలు కూడా నమోదు చేసుకున్నారు.

అలాగే.. 2008 అండర్-19 వరల్డ్ కప్.. విరాట్ కోహ్లీ సారథ్యంలో ఆడిన తరువార్ కోహ్లీ.. వరుసగా మూడు అర్ధసెంచరీలతో కీలక విజయాలను అందించాడు. అలాగే ఆ సంవత్సరం టోర్నీలో.. మూడో లీడింగ్ స్కోరర్‌గా నిలిచాడు. తరువార్ కోహ్లీ.. దేశవాళీ క్రికెట్ తో పాటుగా.. ఐపీఎల్ లోను.. 2008, 2009 సీజన్లలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్ల తరఫున ఆడాడు. అయితే ఐపీఎల్ కెరీర్ లో కేవలం నాలుగు మ్యాచుల్లో మాత్రమే బ్యాటింగ్ చేసిన అతను.. 11 పరుగులు మాత్రమే చేశాడు. కాగా 2008 అండర్-19 వరల్డ్ కప్ లో విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, తరువార్ కోహ్లీలు మంచి స్నేహితులుగా ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed