- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హమ్మయ్యా.. తెలుగు టైటాన్స్ గెలిచింది
దిశ, స్పోర్ట్స్ : ప్రొ కబడ్డీ లీగ్ 10వ సీజన్‌లో ఎట్టకేలకు తెలుగు టైటాన్స్ విజయం సాధించింది. వరుసగా 7 పరాజయాల తర్వాత సొంతగడ్డపై విజయం రుచిచూసింది. మొత్తంగా టోర్నీలో తెలుగు టైటాన్స్‌కు ఇది రెండో విజయం. శనివారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో యూపీ యోధాస్‌పై 32-49 తేడాతో టైటాన్స్ గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో మొదటి నుంచి టైటాన్స్ ఆటగాళ్లు దూకుడుగా ఆడారు. ముఖ్యంగా కెప్టెన్ పవన్, ఓంకార్ పాటిల్ వరుస పాయింట్లు సాధించారు. దీంతో ఫస్టాఫ్‌లో 24-16 తేడాతో ఆధిక్యంలోకి నిలిచి పట్టు సాధించింది. ఈ సీజన్‌లో టైటాన్స్ మొదట చెలరేగి ఆ తర్వాత సెకండాఫ్‌లో తేలిపోయి మ్యాచ్‌ను కోల్పోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే, ఈ మ్యాచ్‌లో టైటాన్స్ ఆ లోపాలను సరిదిద్దుకుంది. సెకండాఫ్‌లోనూ విజృంభించింది. రెండుసార్లు ప్రత్యర్థిని ఆలౌట్ చేసింది. దీంతో చివరి వరకూ ఆధిపత్యం ప్రదర్శించిన తెలుగు టైటాన్స్ 817 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ పవన్ షెరావత్ 16 పాయింట్లతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించగా.. రైడర్ ఓంకార్ పాటిల్ 10 పాయింట్లతో సత్తాచాటాడు. పాయింట్స్ టేబుల్‌లో తెలుగు టైటాన్స్ 2 విజయాలు, 12 ఓటములతో 15 పాయింట్లతో చివరి స్థానంలో ఉన్నది. ఇదే వేదికపై సోమవారం హర్యానా స్టీలర్స్‌తో తలపడనుంది.