ఫ్రెంచ్ ఓపెన్‌లో సంచలనం.. 2వ సీడ్ సబలెంక ఓటమి

by Harish |
ఫ్రెంచ్ ఓపెన్‌లో సంచలనం.. 2వ సీడ్ సబలెంక ఓటమి
X

దిశ, స్పోర్ట్స్ : ఫ్రెంచ్ ఓపెన్‌లో టైటిల్ ఫేవరెట్, 2వ సీడ్ సబలెంకకు షాక్ తగిలింది. ఏకపక్ష విజయాలతో ఎదురులేకుండా సాగిన ఆమె ప్రయాణానికి అన్‌సీడ్ క్రీడాకారిణి ఆండ్రీవా బ్రేక్‌లు వేసింది. బుధవారం జరిగిన ఉమెన్స్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో 2వ సీడ్ సబలెంక ఇంటిదారిపట్టింది. ఆమెపై 7-6(7-5), 4-6, 4-6 తేడాతో రష్యా క్రీడాకారిణి ఆండ్రీవా విజయం సాధించింది. 2 గంటల 29 నిమిషాలపాటు రసవత్తరంగా సాగిన మ్యాచ్‌లో మొదట శుభారంభం చేసింది సబలంకనే. తొలి సెట్‌ను ఆమె టై బ్రేకర్‌లో దక్కించుకుంది. ఆ తర్వాత ఆండ్రీవా బలంగా పుంజుకుంది. సబలెంక తప్పిదాలను సద్వినియోగం చేసుకున్న ఆమె దూకుడుగా ఆడింది. దీంతో వరుసగా రెండు, మూడు సెట్లను దక్కించుకుని విజేతగా నిలిచింది. దీంతో ఓ గ్రాండ్‌స్లామ్‌లో ఆండ్రీవా తొలిసారిగా సెమీస్‌లో అడుగుపెట్టింది. స్విస్ మాజీ క్రీడాకారిణి హింగిస్(1997‌) తర్వాత ఫ్రెంచ్ ఓపెన్‌లో సెమీస్‌కు చేరుకున్న యంగెస్ట్ ప్లేయర్‌గా 17 ఏళ్ల ఆండ్రీవా నిలిచింది. ఆరు డబుల్ ఫౌల్ట్స్, 41 అనవసర తప్పిదాలతో సబలెంక మూల్యం చెల్లించుకుంది. మరోవైపు, 4వ సీడ్ రిబకినా(కజకిస్తాన్)కు కూడా నిరాశే ఎదురైంది. క్వార్టర్స్‌లో రిబకినాను 2-6, 6-4, 4-6 తేడాతో 12వ సీడ్ జాస్మిన్ పాయోలిని(ఇటలీ) మట్టికరిపించి సెమీస్‌కు చేరుకుంది.

ఎదురులేని అల్కరాజ్

మెన్స్ సింగిల్స్‌లో స్పెయిన్ స్టార్ అల్కరాజ్ దూకుడు కొనసాగుతోంది. తాజాగా అతను సెమీస్‌కు చేరుకున్నాడు. క్వార్టర్స్‌లో అల్కరాజ్ 6-3, 7-6(7-3), 6-4 తేడాతో 9వ సీడ్ సిట్సిపాస్(గ్రీస్)పై పోరాడి గెలిచాడు. 3 ఏస్‌లు, 27 విన్నర్లు బాదిన అల్కరాజ్ 4 సార్లు ప్రత్యర్థి సర్వీస్‌లను బ్రేక్ చేశాడు. 33 అనవసర తప్పిదాలు చేసి సిట్సిపాస్ మ్యాచ్‌ను కోల్పోయాడు.

Advertisement

Next Story

Most Viewed